వీడియో : ఇండియాస్‌ నెం.1 స్టేజ్ పై పుష్ప సామి సామి..!

Update: 2022-02-11 05:30 GMT
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా వచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది... ఆ సినిమా పాటలు వచ్చి దాదాపుగా వంద రోజులు కావస్తున్నాయి. అయినా కూడా సినిమా జోరు తగ్గడం లేదు.. ఆ పాటల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ఆహా ఓహో అంటూ సినిమా పాటలను శ్రోతలు యూట్యూబ్‌ తో పాటు ఇతర ప్లాట్‌ ఫామ్స్ పై తెగ చూసేస్తున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా పుష్ప ప్రతి ఒక్క పాట కూడా హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

హిందీలో ముఖ్యంగా శ్రీవల్లి మరియు సామి సామి ఇంకా ఐటెం సాంగ్ ఈ మూడు కూడా కుమ్మేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏమాత్రం జోరు తగ్గకుండా ఇప్పటికి కూడా ఆ పాటలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ డాన్స్ షో ల్లో ఆ పాటలకు డాన్స్ లు చేసేందుకు డాన్సర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాస్ నెం. 1 షో అయిన ఇండియాస్ గాట్ టాలెంట్‌ లో సామి సామి సాంగ్ తో డాన్సర్స్ రచ్చ చేశారు.

ఆ షో కు శిల్ప శెట్టి మరియు బాద్షా లు జడ్జ్‌ లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కూడా సామి సామి డాన్సర్స్ ఫర్ఫ్మార్మెన్స్ తర్వాత సందడి చేశారు. ఆ ఇద్దరు సామి సామి సాంగ్ కు స్టెప్పులు వేయడం జరిగింది. డాన్సర్స్ తో కలిసి వారిద్దరు చేసిన డాన్స్ షో కు ప్రధాన ఆకర్షణ అవ్వబోతుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌ కు చెందిన ఎంతో మంది స్టార్స్ మరియు క్రికెటర్స్‌ సోషల్‌ మీడియా సెలబ్రెటీలు ఎంతో మంది పుష్ప పాటలకు డాన్స్ లతో అదరగొట్టారు.

ఇప్పుడు పొడుగు కాళ్ల సుందరి శిల్ప శెట్టి కూడా పుష్ప ట్రెండ్‌ ను ఫాలో అయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మక షో స్టేజీ పై ఈ డాన్స్ లు వేయడం తో ప్రస్తుం అందరి దృష్టి కూడా ఫుల్‌ ఎపిసోడ్‌ పై పడింది. ఈ శని ఆదివారాల్లో షో టెలికాస్ట్‌ అవ్వబోతుంది.

పుష్ప సినిమా కు సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. ఇప్పటి వరకు సౌత్‌ లోనే సందడి చేసిన దేవి శ్రీ ప్రసాద్‌ గతంలో హిందీలో సినిమాలు చేసినా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో క్రేజ్‌ అక్కడ దక్కలేదు. పుష్ప సినిమా పాటలు అక్కడ ఓ రేంజ్ లో ట్రెండ్‌ అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ లో సినిమాలకు సంగీతం అందించే అవకాశంను దేవి శ్రీ ప్రసాద్‌ దక్కించుకున్నాడు.

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ఏకంగా వంద కోట్ల రూపాయలను దక్కించుకున్న విషయం తెల్సిందే. పుష్ప పార్ట్‌ 2 మరో రేంజ్‌ బిజినెస్ ను దక్కించుకుని వసూళ్లను కూడా అదే స్థాయిలో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


Full View
Tags:    

Similar News