తన తండ్రి జీవితాన్ని బయోపిక్ గా మలిచేందుకు నందమూరి బాలకృష్ణ సిద్ధమైపోయారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు దర్శకుడు తేజ కూడా.. వెంకీ సినిమా నుంచి ఫ్రీ అయిపోయాడు. అయినా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇందుకు కారణం.. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ భామ విద్యా బాలన్ ను సంప్రదించగా.. ఆమె నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అందలేదు.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యారెక్టర్ లో నటించాల్సిందిగా విద్యాబాలన్ ను అడిగారు. అయితే.. ఈ ప్రాజెక్టు గురించి ఆసాంతం విన్న విద్యా బాలన్.. సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లు చెప్పిందట. కానీ ఇప్పటివరకూ డేట్స్ మాత్రం కేటాయించడం లేదు. అందుకే ఎన్టీఆర్ మూవీ టీం మరో సారి సంప్రదించగా.. స్క్రిప్టులో ఉన్న ప్రకారం మాత్రమే సన్నివేశాల చిత్రీకరణ జరగాలని.. అంతకు మించి ఒక్క సీన్ లో కూడా నటించబోనని.. అలాగే తనపై తెరకెక్కించిన సన్నివేశాలు అన్నీ కచ్చితంగా ఫైనల్ కట్ లో కూడా ఉండాలని కండిషన్స్ పెట్టిందట విద్యాబాలన్. వీటన్నిటికీ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది.
అయినా సరే విద్యాబాలన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. గతేడాది కూడా ఓ మలయాళం సినిమా కోసం ఇలాగే మీనమేషాలు లెక్కించి.. చివరకు నో చెప్పేసింది విద్యాబాలన్. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ విషయంలో కూడా ఇలాగే ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.