పెళ్లి తర్వాత ప్రేమను నిలుపుకోవడం చాలా కష్టంః స్టార్‌ హీరోయిన్‌

Update: 2021-03-12 04:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో ముందు వరుసలో ఉండే విద్యా బాలన్‌ నిర్మాత సిద్దార్థ్ రాయ్‌ ను 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఇద్దరిది ప్రేమ వివాహం అనే విషయం తెల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి వైవాహిక జీవితం సాఫీగా సంతోషంగా సాగుతుంది. ఈ 9 ఏళ్ల వైవాహిక జీవిత అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. ప్రతి భార్య భర్త ల మద్య విభేదాల మాదిరిగానే మా మద్య కూడా విభేదాలు.. మనస్ఫర్ధలు కామన్‌ అంటూ చెప్పుకొచ్చారు. వాటిని జయిస్తూ తాము వైవాహిక బంధంను బలంగా మార్చుకున్నట్లుగా చెప్పుకొచ్చరు.

ఇంటర్వ్యూలో విద్యా బాలన్‌ ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి అన్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. వారి అభిరుచులకు తగ్గట్లుగా.. అలవాట్లకు తగ్గట్లుగా జీవిత భాగస్వామి మారాల్సి వస్తుంది. అలా ఒక్కసారిగా మారడం అనేది ఎవరికి అయినా కష్టమే. కాని ఒకరి అభిప్రాయాలను ఒకరు అర్థం చేసుకుని గౌరవించుకున్నప్పుడు మాత్రమే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. చిన్న చిన్న విభేదాలను పట్టుకుని పదే పదే చర్చించకుండా వాటిని వదిలేసి జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. గొడవలు ఎప్పటికప్పుడు వదిలేయకుంటే భార్య భర్తల మద్య అన్యోన్యత దెబ్బ తింటుంది. విభేదాలను మనస్ఫర్థలను ఎప్పటికప్పుడు మర్చి పోవడం భాగస్వామితో సాదారణంగా ఉండటం ఈ 9 ఏళ్ల వైవాహిక జీవితంలో తాను నేర్చుకున్నట్లుగా విద్యా బాలన్‌ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News