మనోరమ, కోవై సరళ తర్వాత కమెడియన్ గా అంత పేరు తెచ్చుకుంటోంది విద్యుల్లేఖ రామన్. బొద్దు రూపం.. గారాలు పోయే మాటలు ఈ అమ్మడికి అస్సెట్స్. అందులోంచే బోలెడంత కామెడీ పుట్టించేస్తోంది. నాని హీరోగా నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. ఇదే సినిమా తమిళ్ లో నీతానె ఎన్ పొన్ వసంతం (ఎన్ ఇపి) పేరుతో రిలీజైంది. గౌతమ్ మీనన్ రూపంలో అవకాశం ఇంటి తలుపు తట్టింది.
అయితే ఆ సినిమా తర్వాత కెరీర్ బిజీ అయిపోతుంది అనుకుంటే .. అచ్చులో బొమ్మ తిరగబడింది. అనూహ్యంగా కెరీర్ రివర్సు అయ్యింది. అవకాశాల్లేక చాలా కాలం ఎదురు చూడాల్సొచ్చింది. ఇదే సంగతిని విద్యుల్లత గుర్తు చేసుకుంటూ.. ఒకానొక సందర్భంలో ఇక నటన వదిలేద్దామనుకున్నా అని ఆవేదన చెందింది. పరిశ్రమలో మేల్ డామినేషన్ ఎక్కువ. కమెడియన్లలో అది మరీ ఎక్కువ. అందుకే వెళ్లిపోదామనుకున్నా. గ్యాప్ తీసుకుని థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుందామనుకున్నా. కానీ అనూహ్యంగా జిల్లా సినిమాతో బ్రేకొచ్చింది. తెలుగులో రన్ రాజా రన్ సినిమా కూడా అమ్మడికి బాగానే ప్లస్సయ్యిందిలే. ఈ కొత్త కమెడియన్ బాగానే అలరిస్తోంది అంటూ అందరూ బోలెడన్ని కితాబులిచ్చారు.
తీయ వేళ సేయనుమ్ కుమారు, వీరం,వాసువుం సెరవణుమ్ ఒణ్ణ పడిచవంగా చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం పులి, పంజు మిట్టయ్, మీందుమ్ ఒరు కాదల్ ఇలా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నా. తెలుగులో కూడా ఛాన్సులు వస్తున్నాయి. కోవై సరళ, మనోరమ వంటి నటీమణులు కామెడీ చేస్తూనే సీరియస్ క్యారెక్టర్లు చేశారు. వారిలా నేనూ ఎదగాలని అనుకుంటున్నానని విద్యు మనసు విప్పి చెప్పింది.