సాదారణంగా తమిళ్ కు చెందిన చిన్న దర్శకుల పేర్లు జాతీయ మీడియాలో వినిపించడం చాలా అరుదు. విఘ్నేష్ శివన్ ఒక సాధారణ దర్శకుడు. ఇప్పటి వరకు ఆయన సినిమాలు భారీ విజయాలను సాధించింది లేదు.. అక్కడ వందల కోట్లు వసూళ్లు రాబట్టిన దాఖలాలు లేవు. అయినా కూడా ఇప్పుడు విఘ్నేష్ శివన్ పేరు జాతీయ స్థాయిలో మారు మ్రోగుతోంది.
లేడీ సూపర్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ను పెళ్లి చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీని నయనతార దక్కించుకున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా నయనతార కు ఉన్న పాపులారిటీ నేపథ్యంలో విఘ్నేష్ శివన్ గురించి కూడా జాతీయ స్థాయిలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
విఘ్నేష్ శివన్ కు మరో అరుదైన గౌరవం దక్కడంతో మళ్లీ మీడియాలో నిలిచాడు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఎంతో మంది తమిళనాట హేమా హేమీలు అయిన దర్శకుడు ఉండగా.. తనను డైరెక్ట్ చేసే అవకాశం విఘ్నేష్ శివన్ కు సీఎం స్టాలిన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
జూలై 28 నుండి ఆగస్టు 10వ తారీకు వరకు చెన్నైలో చెస్ ఒలింపియాడ్ పోటీలు నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో దాదాపుగా 190 దేశాలకు చెందిన 2 వేల మంది చెస్ క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. ఆ రెండు వారాల పాటు చెన్నై నగరం మొత్తం సందడిగా ఉండబోతుంది.
సదరు పోటీల నిర్వహణ ప్రచారం కోసం ఒక వీడియోను తమిళనాడు ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి స్టాలిన్ కనిపించబోతున్నాడు. ఆ వీడియో దర్శకత్వ బాధ్యతలను దర్శకుడు విఘ్నేష్ శివన్ కు ఇవ్వడం జరిగింది. స్టాలిన్ తనయుడు ఉదయనిధి కి నయన్ మరియు విఘ్నేష్ ల తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఆ సన్నిహిత సంబంధాల వల్లే సీఎం ను డైరెక్ట్ చేసే అవకాశంను విఘ్నేష్ శివన్ దక్కించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం విశేషం. సంగీతాన్ని అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్న సమయంలో శంకర్ వంటి దర్శకుడిని దర్శకుడిగా ఎందుకు తీసుకోలేదు అనే వారు కూడా లేకపోలేదు.
మొత్తానికి మొన్న నయన్ తో పెళ్లి వార్తలో నిలిచిన విఘ్నేష్ శివన్ ఇప్పుడు సీఎం స్టాలిన్ ను డైరెక్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ముందు ముందు నయనతార తో మాత్రమే కాకుండా పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమా లు తీసి వందల కోట్ల వసూళ్లు నమోదు చేసి మళ్లీ వార్తల్లో నిలుస్తాడేమో చూడాలి.