నయన్ కోసం లవర్ సినిమా

Update: 2019-02-12 07:13 GMT
తమ మధ్య ఉన్న అనుబంధం గురించి బహిరంగంగా చెప్పుకోక పోయినా హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ మధ్య ఏముందో ఫోటోలు వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు మీడియాతో పాటు ప్రేక్షకులు సైతం గమనిస్తున్నారు. కెరీర్ ఇంకా ఉంది కాబట్టి పెళ్లి కోసం నయన్ తొందరపడటం లేదు కానీ విగ్నేష్ మాత్రం తాళి కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కాలేదు అన్న మాటే కానీ షూటింగ్ గ్యాప్ రావడం ఆలస్యం ఔటింగ్ పేరుతో ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని విదేశాలకు చెక్కేయడం గత మూడేళ్ళలో చాలా మాములు విషయమైపోయింది.

నానుమ్ రౌడీ దా నుంచి వీళ్ళ బంధం మరింత ధృడంగా మారింది. ఇప్పటిదాకా దర్శకుడిగా మాత్రమే పరిమితమైన విగ్నేష్ శివన్ త్వరలో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. హీరోయిన్ ఎవరని అడగకండి. ఎవరితోనో ఎందుకు తీస్తాడు. నయనతారనే లీడ్ రోల్ లో ఉంటుంది. తన చుట్టే కథ తిరిగేలా దర్శకుడు మిలింద్ రాయ్ చెప్పిన లైన్ బాగా నచ్చిందట. ఈ మిలింద్ ఎవరో కాదు.

రెండేళ్ల క్రితం సిద్దార్థ్-ఆండ్రియా ప్రధాన పాత్రల్లో గృహం అనే హారర్ మూవీతో మెప్పించాడు కదా. అతనే. సహనిర్మాతగా తను కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమే. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే విగ్నేష్ శివన్ ఈ సినిమాకు సంబంధించి కేవలం నిర్మాణ వ్యవహారాలు మాత్రమే చూసుకోబోతున్నాడు. పేరుకు విగ్నేష్ ఉన్నా పెట్టుబడి ఇద్దరిదీ అని చెన్నై టాక్. కాబోయే భర్త కాబట్టి ఆ మాత్రం చేయి వేయకుండా నయన్ మాత్రం ఎలా ఉంటుంది
Tags:    

Similar News