విఘ్నేష్ శివన్ - నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. ఈ జంట త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారన్నది సోషల్ మీడియా మాట. అయితే నేడు రేపు అంటూ ఇన్నాళ్లు దోబూచులాడుకోవడం.. క్లారిటీ లేకపోవడంతో.. ఆ జంట మధ్య కలతలు చెలరేగి విడిపోతున్నారని ప్రచారం సాగడం తెలిసిందే. ఈ చెడు ప్రచారంపై నయన్ కంటే విఘ్నేష్ ఎక్కువగా రియాక్టవుతున్నాడు. నెటిజనుల్లో ఎవరైనా ఎరక్కపోయి దొరికిపోతే షంటేస్తున్నాడు.
మొన్న మదర్స్ డే రోజున ఓ అభిమానిపై విఘ్నేష్ ఓ రేంజులో విరుచుకు పడ్డాడు. అది కూడా తన అత్త(నయన్ తల్లి గారు)ను వెనకేసుకొస్తూ అతగాడిపై వ్యంగ్యంగా స్పందించాడు. అసలింతకీ విఘ్నేష్ తో నెటిజనుడికి వచ్చిన గొడవేమిటి? అంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.
మాతృదినోత్సవం సందర్భంగా విఘ్నేష్ తన ప్రేయసి నయనతార మదర్ కి విషెస్ చెప్పాడు. అతను ఒక చిన్న పిల్లవాడిని మోస్తున్న ఫోటోను పోస్ట్ చేసి, ``నా పిల్లలకు కాబోయే తల్లి.. తనకి జన్మనిచ్చిన ఆ తల్లికి హ్యాపీ మదర్స్ డే ...`` అని క్యాప్షన్ పెట్టాడు. అత్తగారికి ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. ``మిసెస్ కురియన్ మీకు శుభాకాంక్షలు ... మీరు ఇంత అందమైన అమ్మాయిని కని మంచి పని చేసారు ... మేం నిన్ను ప్రేమిస్తున్నాం. అమ్మా .. మీకు ధన్యవాదాలు`` అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
అయితే విఘ్నేష్ కి వెంటనే ట్రోల్స్ తప్పలేదు. అతడిపై చాలా అసభ్యకర పదజాలంతో దునుమాడాడు ఓ నెటిజనుడు. ముందు మీ తల్లి గారికి విషెస్ చెప్పు..! అంటూ అతడు సూచించాడు. అయితే దానిపై విఘ్నేష్ ఓ రేంజులోనే సెటైర్ వేశాడు.``సరే బ్రో..హ్యాపీ మదర్స్ డే మీకు కూడా ... మీ అమ్మ గొప్ప హృదయం ఉన్న వ్యక్తికి జన్మనిచ్చింది.. గాడ్ ఆమెను ఆశీర్వదించండి`` అంటూ పంచ్ వేశాడు. ఆ వెంటనే నెటిజనుడు చాట్ నుంచి పలాయనం చిత్తగించాడు. ఈ ఎపిసోడ్ లో రెండు విషయాలపై అభిమానులకు క్లారిటీ వచ్చింది. ఒకటి విఘ్నేష్ తన భార్యను కానీ.. అత్తను కానీ ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇక నయన్ తో బ్రేకప్ అయ్యింది అంటే అసలే క్షమించడు. అందుకే నయన్ తల్లి అవుతోంది.. లైఫ్ లో సెటిలైపోతున్నాం.. అన్న సంకేతాన్ని కూడా ఇచ్చాడు. మునుముందు పెళ్లి సంగతితో పాటు ప్రతిదీ వివరంగా చెబుతాడేమో చూడాలి.