న‌య‌నతార బాయ్‌ ఫ్రెండ్‌ తో సూర్య సినిమా

Update: 2016-09-06 05:02 GMT
విఘ్నేష్ శివ‌న్ అంటే గుర్తు పట్టేవాళ్లు ఎంత‌మందో తెలియ‌దు కానీ... న‌య‌న‌తార బాయ్‌ ఫ్రెండ్  విఘ్నేష్ అంటే మాత్రం ``ఓహో `నేను రౌడీనే` ద‌ర్శ‌కుడా?`` అని ఇట్టే చెప్పేస్తారు. `నేను రౌడీనే` సినిమా నుంచి న‌య‌న్‌ - విఘ్నేష్ ప్రేమ‌లో ప‌డిపోయారు. ఇటీవ‌ల సైమా వేడుక‌లో అల్లు అర్జున్‌ ని కాద‌ని - త‌న బాయ్‌ ఫ్రెండ్ చేతుల‌మీదుగా అవార్డు అందుకొందంటే వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఎంత థిక్కెస్ట్ బంధం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే తాజాగా విఘ్నేష్ ఓ క్రేజీ ప్రాజెక్టుని ప్ర‌కటించాడు.

త‌దుప‌రి సూర్య‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అందులోనూ క‌థానాయిక‌గా న‌య‌న‌తారే న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. సూర్య ఆలోచిస్తున్నా విఘ్నేష్ మాత్రం న‌య‌న‌తారే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. దాదాపుగా న‌య‌నే ఓకే కావొచ్చ‌ని అంటున్నారు.  నిజానికి సూర్య త‌దుప‌రి సినిమాకి క‌బాలి ఫేమ్ పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ సూర్య మాత్రం ఇటీవ‌ల మ‌న‌సు మార్చుకొన్నాడ‌ట‌. విఘ్నేష్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న‌తోనే సినిమా చేయాల‌ని ఫిక్స‌యిపోయాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది.
Tags:    

Similar News