పెళ్లి గురించి నయన్‌ లవర్‌ కామెడీ కామెంట్స్‌

Update: 2018-09-20 07:38 GMT
టాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌ గా కొనసాగుతున్న నయనతార గత కొంత కాలంగా యువ దర్శకుడు విఘ్నేష్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొదట వీరిద్దరి ప్రేమ వార్తలను కొందరు కొట్టి పారేశారు. అయితే వీరిద్దరి మద్య పెరుగుతున్న అన్యోన్యం మరియు వీరిద్దరు కలిసి తిరుగుతూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న కారణంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా నిర్థారణ అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. పలు సార్లు నయనతార ఈ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. తాజాగా విఘ్నేష్‌ కూడా పెళ్లి విషయమై క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేయడం జరిగింది.

ఈమద్య నయనతార మరియు విఘ్నేష్‌ లు అమృత్‌ సర్‌ లోని స్వర్ణ దేవాలయంను సందర్శించడం జరిగింది. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక ఇంగీష్‌ దిన పత్రికతో విఘేష్‌ మాట్లాడటం జరిగింది. నయన్‌ గురించి పలు విషయాలను చెప్పిన విఘ్నేష్‌ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌ లో ఉంచాడు.

నయన్‌ తో పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో తప్పించుకునేందుకు పెళ్లి గురించి తనకు ఐడియా లేదు అంటూ సమాధానం ఇచ్చాడు. అదే సమయంలో నయనతారతో ప్రస్తుతం చాలా సంతోషకరమైన సమయంను గడుపుతున్నాను, ఆమెను కలవడం అదృష్టంగా భావిస్తున్నా, ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు మామూలు సమస్యలు కాదు. వాటన్నింటికి ధైర్యంగా నిలిచి ఆమె పోరాడటం జరిగింది.

ఒక వ్యక్తిగా నయన్‌ తనకు ఆదర్శనీయం అన్నాడు. ఆమెతో పెళ్లి విషయం నాకు తెలియదు, ముందు నయన్‌ ను అడగాలి, ఆ తర్వాత మా అమ్మ అనుమతి కూడా తీసుకోవాలి. అప్పుడు పెళ్లి గురించి మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను అన్నాడు. పెళ్లి గురించి అవగాహన లేకుండానే, నయన్‌ కు ఇష్టం లేకుండానే కలిసి తిరుగుతున్నారా, కామెడీ కామెంట్స్‌ ఆపి నిజం చెప్పు తంబీ అంటూ తమిళ జనాలు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News