న‌య‌న్‌ తో పెళ్లికి డ‌బ్బుల్లేవ‌ట‌

Update: 2021-06-29 15:30 GMT
న‌య‌న‌తార ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. ఆమె ఓ సినిమాలో న‌టిస్తే అందులో హీరో ఉండాల్సిన ప‌ని లేదు. నయ‌న్ పేరు మీదే ముప్ఫై న‌ల‌భై కోట్ల బిజినెస్ జ‌రిగిపోతుంది. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగానే తీసుకుంటోంది న‌య‌న్. ఇక ఆమె ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుడే. శింబు, విజ‌య్ సేతుప‌తి, సూర్య లాంటి స్టార్ల‌తో సినిమాలు చేశాడ‌త‌ను. ప్ర‌స్తుతం న‌య‌న్, సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా తీస్తున్నాడు. ఇదీ వీళ్లిద్ద‌రి స్థాయి. ఐతే న‌య‌న‌తార‌తో చాలా ఏళ్ల నుంచి ప్రేమ‌లో ఉన్న విఘ్నేష్‌.. ఆమెను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవ‌ట్లేద‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉద‌యిస్తోంది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. వీరి పెళ్లి క‌బురు వినిపించ‌ట్లేదు. ఐతే తాము ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి స‌రిప‌డా డ‌బ్బులు లేక‌పోవ‌డమే కార‌ణ‌మ‌ని విఘ్నేష్ అంటుండ‌టం విశేషం.

తాజాగా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో చిట్ చాట్ సంద‌ర్భంగా ఈ మాట అన్నాడు విఘ్నేష్‌. మీ పెళ్లి చూడాల‌ని ఎంత‌గానో కోరుకుంటున్నా.. ఇంకెప్పుడు చేసుకుంటారు అని ఒక నెటిజ‌న్ అడిగితే.. న‌య‌న్‌తో పెళ్లి అంటే చాలా డ‌బ్బులు ఖ‌ర్చ‌వుతాయ‌ని, ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేద‌ని.. దాన్ని స‌మ‌కూర్చుకునే ప‌నిలో ఉన్నాన‌ని.. స‌రిప‌డా డ‌బ్బులు వ‌చ్చిన‌పుడు పెళ్లి చేసుకుంటాన‌ని చ‌మ‌త్క‌రించాడు విఘ్నేష్‌. ఐతే ప్ర‌తిసారీ పెళ్లి గురించి అడుగుతుండేస‌రికి ఏం చెప్పాలో తెలియ‌క స‌ర‌దాగా విఘ్నేష్ ఈ మాట అన్నట్లున్నాడు. ఇక నయ‌న్ కోసం ఎక్కడికైనా వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌ని.. ఆమె ప‌క్క‌నుంటే చాల‌ని అన్న విఘ్నేష్‌.. ఆమెను చీర‌లో చూడ‌టం త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు.
Tags:    

Similar News