ఇటీవల కాలంలో వెండి తెరపై వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. సినీ.. రాజకీయ.. క్రీడా.. సైనిక రంగాలకు చెందిన వారితో పాటు వైజ్ఞ విజ్ఞాన రంగాలకు చెందిన వారు మరియు సేవా రంగానికి చెందిన వారి బయోపిక్ లు వస్తున్నాయి. కమర్షిల్ గా ఆలోచించకుండా గొప్ప వారి గురించి అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఫిల్మ్ మేకర్స్ బయోపిక్ లను తీస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పలు బయోపిక్ లు ఆకట్టుకోగా ప్రస్తుతం షూటింగ్ దశలో మరికొన్ని ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు సామాజిక కార్యకర్త లేడీ హీరోగా గుర్తింపు దక్కించుకున్న ఉమ ప్రేమన్ బయోపిక్ ను తీసేందుకు సిద్దం అవుతున్నారు.
తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన ఉమ ప్రేమన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇండియాలోనే ఆమె మొదటి కిడ్నీ దాతగా నిలిచారు. రెండు లక్షల డయాలసీస్.. 20 వేల మందికి హార్ట్ సర్జరీలు చేయించడంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలకు చికిత్సలు చేయించడం.. గిరిజన పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయించడం పేద వారి కోసం ఇళ్ల నిర్మాణం వంటివి కూడా ఆమె చేయించింది. ఆమె ప్రతిభకు రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. అలాంటి గొప్ప సంఘ సేవకురాలైన ఉమ ప్రేమన్ బయోపిక్ ను విఘ్నేశ్వరన్ విజయన్ రూపొందించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటించే అవకాశం ఉంది. సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేలా ఈ సినిమాను రూపొందించబోతున్నారట.