'అర్జున్ రెడ్డి'తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రౌడీ స్టార్ విజయ్ దేరవకొండ. మళ్లీ అలాంటి సెన్సేషనే సృష్టించడానికి 'లైగర్' మూవీతో రెడీ అయిపోతున్నాడు. వెర్సటైల్ డైరెక్టర్ పూర్తి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేస్ లో ప్రెస్టేజియస్ మూవీగా ఈ సినిమాని చేస్తున్నారు. హీరో గా విజయ్ దేవరకొండకు, దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు ఈ మూవీ బిగ్ ఛాలెంజ్ గా నిలిచింది. బాలీవుడ్ క్రేజీ మేకర్స్ కరణ్ జోహార్, అపూర్వ మెహతా లతో కలిసి పూరి జగన్నాథ్, చార్మి ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించారు.
ఇదే మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి అడిగుపెట్టబోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అసోసియేట్ కావడం, ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించడంతో ఈ మూవీపై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
విజయ్ దేవరకొండ, పూరి టీమ్ దాదాపు రెండేళ్లు శ్రమించిన ఈ మూవీ రిలీజ్ కి రెండు నెలల సమయం వుండటంతో చిత్ర బృందం ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ముంబై స్లమ్ ఏరియాలో వుండే ఛాయ్ బండీ వాలా ఎలా బాక్సింగ్ లో ఛాంపియన్ గా నిలిచాడనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ మూవీని రూపొందించారు. తాజాగా ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఫస్ట్ సింగిల్ గా 'అక్డీ పక్డీ' అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ, అనన్య పాండేలపై పార్టీ సాంగ్ గా చిత్రీకరించిన ఈ పాట ఓ రేంజ్ లో నెట్టింట సందడి చేస్తోంది. ఐదు భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. తాజాగా సోమవారం సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు.
ఇంత వరకు డ్యాన్స్ ల్లో ప్రత్యేకంగా మెరుపులు మెరిపించని విజయ్ దేవరకొండ ఈ పాటలో మాసీవ్ స్టెప్పులు, ఫ్లోర్ డాన్స్ తో అదరగొట్టేశాడు. విజయ్ నుంచి ఈ రేంజ్ డాన్స్ నంబర్ రావడం ఇదే తొలిసారి కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనన్య గ్లామర్, విజయ్ దేవరకొండ మాసీవ్ స్టెప్పులతో ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది.
అయితే ఈ పాట గురించి తాజాగా హీరో విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింటి వైరల్ గా మారింది. ముందు ఈ పాట కోసం డాన్స్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీని చూసి విజయ్ దేవరకొండకు దాదాపుగా ఏడుపు వచ్చేసిందట. ఈ స్టెప్పులేంటీ? .. నేను చేయాలా అని ఓ రేంజ్ లో భయపడ్డారట. అయితే సెట్ లోకి వెళ్లగానే షూటింగ్ లో మాత్రం చించేశారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కొరియోగ్రఫీ చూసి దాదాపు ఏడ్చేశాను. అయితే షూటింగ్ లో మాత్రం అద్భుతం జరిగింది. బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను' అని ట్వీట్ చేశారు.