ఎందుకు దళపతి నీకు ఈ ఫీట్లు..?!

Update: 2019-10-09 04:29 GMT
తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నించడం క్రీస్తు పూర్వం కాలం నుంచి ఉంది.  జస్ట్ కిడ్డింగ్.. అంటే ఇది ఇప్పటి వ్యవహారం కాదు.  మన తెలుగు హీరోలకు పరాయి భాషలలో పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన రావడానికి కొన్ని దశాబ్దాలకు పూర్వమే తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించారు.. హిట్ల మీద హిట్లు సాధించారు.  రజనీకాంత్..  కమల్ హసన్ లను మన తెలుగు ప్రేక్షకులు కూడా ఏరోజూ పరాయి భాషల హీరోలుగా చూడలేదు. ఈ జెనరేషన్ కోలీవుడ్ హీరోలలో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయింది.  అయితే అందరికీ టాలీవుడ్ మార్కెట్ పట్టు చిక్కదు కదా.. ఇళయదళపతి విజయ్ కూడా ఈ విషయంలో పెద్దగా సక్సెస్ చూడలేకపోయాడు.

ఈమధ్య ఒకటి అరా సినిమాలు ఏదో పరవాలేదనిపించినా ఇప్పుడు తమిళ సినిమాల పరిస్థితి మహా కష్టంగా ఉంది.  ఈమధ్య తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. తెలుగులో భారీ మార్కెట్ సాధించిన విక్రమ్.. సూర్యలకే ఇక్కడ పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉంది.  విక్రమ్.. సూర్యల సినిమాలు హిట్ అయినా కాకపోయినా ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి. అదేంటంటే వారు రజనీ.. కమల్ తరహాలో తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ చేపడతారు. అయితే విజయ్ మాత్రం ఇందుకు భిన్నం.  తెలుగు మార్కెట్ కావాలి కానీ ప్రమోషన్స్ కు రొంబ దూరం.  ఏ సినిమా అయినా హైదరాబాద్  కు రావడం.. ప్రమోషన్స్ చేయడం అనేది కలలో మాట. కనీసం చెన్నై నుంచి కూడా ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసే బాపతు కాదు.  నిజానికి సూర్య.. విక్రమ్ ల కంటే విజయ్ తమిళంలో చాలా పెద్ద హీరో కానీ తెలుగు మార్కెట్ పట్టు మాత్రం చిక్కలేదు.

విజయ్ ప్రస్తుతం 'బిగిల్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.  అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజిల్' పేరుతో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  అయితే మెజారిటీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో మాత్రం విజయ్ ఒక రిజెక్టెడ్ హీరో. ఈ విషయం చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఓపెన్ గానే చెప్తున్నారు. మరి దళపతి ఈ విషయం పట్టించుకుంటాడా అంటే అదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చి నేనున్నాను అంటూ 'విజిల్' వేస్తాడు. తెలుగు ప్రేక్షకులు ఎంత రిజెక్ట్ చేసినా ఈ ఫీట్లు ఎందుకో!


Tags:    

Similar News