'సైతాన్' టీజర్ ఎందుకు తీసేశారబ్బా??

Update: 2016-10-05 09:23 GMT
సడన్ గా తన ఫేస్ బుక్.. ట్విట్టర్.. అలాగే యుట్యూబ్ లో పెట్టిన ''సైతాన్'' సినిమాను టీజర్ ను డెలీట్ చేశాడు హీరో విజయ్ ఆంటోని. మనోడు ''బిచ్చగాడు'' సినిమాతో తెలుగులో కూడా వరల్డ్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే మనోడు లేటెస్టు సైతాన్ అనే సినిమాతో తెలుగులో ''భేతాళుడు''గా వస్తున్నాడు. అసలు ఈ టీజర్ గోలేంటో చూద్దాం పదండి.

ఓ నాలుగు రోజుల క్రితం చనిపోయిన ప్రముఖ తమిళ లిరిసిస్ట్ అన్నామలై ''బేతాళుడు'' సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం కొన్ని సంస్కృత పదాలను వాడారు. అయితే అవి కొన్ని హిందూ వేదాల నుండి తీసుకోబడిన స్లోకాలు అని.. వాటి కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నట్లు కొన్ని హిందూ మత సంస్థలు పేర్కొన్నాయి. దానితో వెంటనే ఈ సైతన్/భేతాళుడు టీజర్ ను ఉపసంహరించుకుంటున్నానని.. కొత్త లిరిక్స్ తో మరో టీజర్ ను అప్ లోడ్ చేస్తానంటూ విజయ ఆంటోనీ క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు యుట్యూబ్ లో ఈ సినిమా అఫీషియల్ టీజర్ ను డెలీట్ చేసేశారు. అది సంగతి.

ఇకపోతే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా విజయ్ ఆంటోనికి ప్లస్సయ్యేలా ఉన్నాయి. బిచ్చగాడు సినిమాతో కావల్సినంత క్రేజ్ రాగా.. ఇప్పుడు కాంట్రోవర్సీలతో ఇంకాస్త వచ్చేస్తుంది. సినిమాకు హైప్ తెచ్చేస్తోంది. కాదంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News