ఈ క్ష‌ణం నాతోనే ఉంటుంది

Update: 2016-01-12 16:30 GMT
ఏదీ మోసుకెళ్ల‌లేం. కేవ‌లం జ్ఞాప‌కాలు, స్మృతులు మాత్ర‌మే మ‌న‌తో ఉంటాయి. పుట్టేప్పుడు తెచ్చుకోలేదు. గిట్టేప్పుడు ప‌ట్టుకెళ్ల‌లేం. అనుభ‌వాలు ఘ‌డించి ముందుకు సాగ‌డ‌మే. జీవితంలో నేను నేర్చుకున్న‌ది ఇదొక్క‌టే. ఇదిగో ఈరోజే నాన్న‌కు ప్రేమ‌తో చిత్రీక‌ర‌ణ చివ‌రి రోజు.. అధికారికంగా ఇదే నా చివ‌రి రోజు... ఇంత పోయెటిక్ గా ఎమోష‌న‌ల్ అయ్యాడు విజ‌య్.కె.చ‌క్ర‌వ‌ర్తి. సౌత్ ఇండ‌స్ర్టీలో ఉన్న టాప్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా అత‌డు అంద‌రికీ సుప‌రిచిత‌మే. అయితే ఆయ‌న త‌న జీవితంలోనే ఇంత ఎమోష‌నల్ అయ్యింది లేదు. త‌న జీవితానుభవాల సారాన్ని పిండి దానిని అంద‌రికీ ఓపెన్‌ గా చెప్పాడంతే.

నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో వేదిక‌పై ఎన్టీఆర్‌ - సుకుమార్ వంటి గొప్ప వ్య‌క్తులు త‌న‌ని పొగిడేశారంటే దాని వెన‌క ఎంతో ఎఫెర్టు ఉంద‌ని ఆడియెన్‌ కి అర్థ‌మైంది. విజ‌య్.కె.చ‌క్ర‌వ‌ర్తి కెరీర్‌ లో ఎన్నో సినిమాల‌కు ప‌నిచేశాడు. కానీ నాన్న‌కు ప్రేమ‌తో మేకింగ్ మెమ‌రీస్‌ ని ఎప్ప‌టికీ త‌న‌తోనే ఉంచుకుంటాన‌ని చెప్పారు. దీన్నిబ‌ట్టి ఆ క్ష‌ణం ఆ సినిమాటోగ్రాఫ‌ర్ మూవీతో ఎంత‌గా క‌నెక్ట‌య్యాడ‌న్న‌ది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మూవీ ఈ సినిమాకి ప‌నిచేసిన ఎంద‌రో అనుభ‌వాల‌కు ప్ర‌తీక‌గా ఉండ‌బోతోంది. తండ్రితో  కొడుకు అనుబంధం అనేది ఏ తండ్రి- కొడుక్కి అయినా క‌నెక్ట‌వుతుంది క‌దా! అలా విజ‌య్‌ కి కూడా క‌నెక్ట‌య్యింద‌న్న‌మాట‌! సుకుమారే అలా క‌నెక్ట్ చేశాడ‌ని అనుకోవ‌చ్చు.
Tags:    

Similar News