చెన్నై వీధుల్లో ఊహించని ట్విస్టు గల్లీ నుంచి దిల్లీ వరకూ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో.. దళపతి విజయ్ ఓటు వేయడానికి చెన్నైలో సైకిల్ పై పోలింగ్ బూత్ కి రావడం కలకలం రేపింది. ఈ రైడ్ ట్రాఫిక్ జామ్ కి దారితీసింది. వీధుల్లో జనం అతడిని వెంబడించడంతో తేలికపాటి పోలీసు చర్య తప్పలేదు.
ఆన్ లైన్ లో వైరల్ అయిన విజువల్స్ లో విజయ్ చెన్నైలోని ఒక ఇరుకైన రహదారిపై తన సైకిల్ ను నడుపుతున్నట్లు కనిపించింది. వాస్తవానికి అతనిని ద్విచక్ర వాహనాల్లో అనుసరిస్తున్న వ్యక్తులు ఫోటోలు తీస్తున్నారు. విజయ్ వేగంగా సైకిల్ పెడల్ ని తొక్కేందుకు ప్రయత్నించాడు. కాని ఆ గుంపులో అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపించింది. తనని వెంబడించే పరివారాన్ని దాటుకుని వెళ్లలేకపోయాడు.
పోలింగ్ బూత్ వద్ద జనం ఉద్రేకంతో ఊగుతూ అతని వద్దకు వెళుతుండగా వారిని లాగేందుకు పోలీసులు లాఠీలను ఉపయోగించవలసి వచ్చింది.
ఆ ఎపిసోడ్ ముగిసిన అనంతరం రకరకాల ఊహాగానాలు. అసలు అంత పెద్ద స్టార్ ఏ కార్ లోనో రాకుండా అలా సైకిల్ పై రావడం వెనక కారణమేమిటి? విజయ్ తన సైకిల్ ప్రయాణంతో ఇంధన ధరల భారంపై సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? కేంద్రంపై ఎదురు దాడికి ఇలా తెలివిగా ప్లాన్ చేశాడా? అనే దానిపై ఊహాగానాలు సాగాయి.
అయితే తాను అలా రావడానికి కారణమేమిటో విజయ్ అసిస్టెంట్ వెల్లడించారు. పోలింగ్ బూత్ ఉన్న ఇరుకైన వీధిలో పార్కింగ్ సమస్యలను నివారించడానికి తాను అలా చేశారని విజయ్ సన్నిహిత ప్రచారకర్త స్పష్టం చేశారు.
``దళపతి విజయ్ కారును ఉపయోగించకుండా సైకిల్ ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పోల్ బూత్ తన నివాసం పక్కనే ఉంది. కారు తీసుకోవటం రహదారిని మరింత రద్దీగా మార్చేసి ఉండవచ్చు. దీని వెనుక వేరే ఉద్దేశ్యం లేదు!`` అని రియాజ్ కె అహ్మద్ ట్వీట్ చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలపై బిజెపితో పొత్తు పెట్టుకున్న తమిళనాడు అధికార ఎఐఎడిఎంకెకు విజయ్ సందేశం పంపారని పలువురు డిఎంకె నాయకులు అనడంతో ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
కాంగ్రెస్ నుంచి వైదొలిగిన తరువాత బిజెపి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఖుష్బు సుందర్ ఏమన్నారంటే.. ``హీరో విజయ్ ఓటు వేయడం ఇంధన ధరల పెంపుపై సందేశం కాదు. వేరొకరి బైక్ మీద ప్రయాణించడం డిఎంకె ఆపాలి`` అంటూ కౌంటర్ వేశారు. మొత్తానికి విజయ్ సైకిల్ రైడ్ అంతటి రాజకీయ రగడ సృష్టించిందన్నమాట.