బాక్సింగ్ - MMA కు మధ్య తేడా ఏంటో చెప్పిన VD..!

Update: 2022-08-24 11:35 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ''లైగర్". అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మరియు ప్రచార కార్యక్రమాలు 'లైగర్' చిత్రానికి కావాల్సినంత బజ్ క్రియేట్ చేశాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక MMA ఫైటర్ గా కనిపించనున్నాడు.

'లైగర్' చిత్రంలోని తన పాత్ర కోసం వీడీ తీవ్రంగా శ్రమించాడు. కఠినమైన వర్కౌట్స్ చేసి 6 ప్యాక్ అబ్స్ తో పర్ఫెక్ట్ బాడీని రెడీ చేశాడు. సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం అదే ఫిజిక్ ని మెయింటైన్ చేసాడు.

ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసి.. పూరీ గత చిత్రాలతో పోలికలు పెట్టారు నెటిజన్లు. ఇందులో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నాడని చాలా మంది అనుకున్నారు. అయితే ఎంఎంఏ అనేది బాక్సింగ్ కంటే వైలెంట్ స్పోర్ట్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో VD ధృవీకరించాడు.

''MMAలో ఒక ఫైటర్ గేమ్ గెలవాలంటే ప్రత్యర్థిని నాకౌట్ చేయాలి. బాక్సింగ్ లో కౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఎంఎంఏలో మాత్రం ప్రత్యర్థి నేలకొరిగే వరకు పోరాడతారు. ఇది శారీరకంగా మరియు మానసికంగా ఇంటెన్స్ స్పోర్ట్. MMAలోని ఫైటర్స్ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన అథ్లెట్లు" అని విజయ్ దేవరకొండ తెలిపారు.

'లైగర్' అనేది విజయ్ మరియు పూరీ జగన్నాథ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. వారి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాపై దర్శక నిర్మాతలు మరియు నటీనటులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రతీ ఇంటర్వ్యూలో ఈ విషయంలో పక్కా బ్లాక్ బస్టర్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లైగర్' మూవీ తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా సత్తా చాటుతోంది. మరి ఈ చిత్రం వీడీ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

'లైగర్' సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. దీంతో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు అరంగేట్రం చేస్తున్నారు. రమ్యకృష్ణ - విషు రెడ్డి - రోనీత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ - ఛార్మీ కౌర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
Tags:    

Similar News