ఫ్యాన్స్ కి మాటిస్తున్నాను .. 'లైగర్' కుమ్మేస్తాడు: రౌడీ హీరో

Update: 2022-08-21 04:52 GMT
విజయ్ దేవరకొండ కెరియర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా 'లైగర్' రూపొందింది. పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 25వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. పూరి ..  చార్మీ .. విజయ్ దేవరకొండ .. అనన్య పాండే మాత్రమే ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఈ ఈవెంట్ కి వచ్చినవాళ్లకీ .. ఇంట్లో నుంచి చూస్తున్న వాళ్లందరికీ నా నమస్కారం. నేను ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మీ అందరి దగ్గరకి రావాలి .. మిమ్మల్ని కలవాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది నా కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ ఇది. మీ అందరితో కలిసి ఎంజాయ్ చేయాలనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా సిటీల చుట్టూ తిరుగుతూ వస్తున్నాము.

ఈ రోజున ఇక్కడ నిలవడానికి అవసరమైన శక్తిని ఇచ్చింది మీ ప్రేమనే. ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడికి వెళ్లినా విపరీతమైన ప్రేమను పంచారు. ఆ ప్రేమాభిమానాలను నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేను యాక్టింగ్ ఆపేసి అరవై ఏళ్లొచ్చేసి ఇంట్లో కూర్చుంటే, ఈ 20 రోజుల్లో జరిగిన ఈవెంట్స్ ను చూస్తూ ఉంటాను. అలాంటి అందమైన జ్ఞాపకాలను మీరు నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాతో నేను మీకు ఒక మెమరీ ఇవ్వాలి .. అది నా బాధ్యత.

'లైగర్' మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీకు కావలసిన ఎంటర్టైన్ మెంట్ ఇస్తే నా ప్రయత్నం ఫలించినట్టే. 'లైగర్' కథ నాకు చెప్పేసి 'వీడి నోటి నుంచి ఏమొస్తుందా' అని పూరిగారు .. చార్మీ గారు నా వైపు చూస్తున్నారు. అప్పుడు నేను చెప్పిన ఒకే ఒక మాట 'మెంటల్'.  మనవాళ్లు మస్తు ఎంజాయ్ చేస్తారు .. ఈ సినిమాను సాధ్యమైనంత తొందరగా చేసేయాలనిపించింది. మూడేళ్ల మా కష్టం మీ ముందుకు రావడానికి నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుంటూరుకు నేను మాట ఇస్తున్నాను సినిమా కుమ్మేస్తది" అంటూ చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ ఇంకా మాట్లాడాలని అనుకున్నాడుగానీ, జనాలు ఆయన వైపు తోసుకుంటూ వస్తుండటం ..  సెల్ఫీల కోసం ఎగబడటం వంటివి చేస్తుండటంతో వాళ్లని కంట్రోల్ చేయడం అక్కడివారి కష్టమైపోయింది. దాంతో విజయ్ దేవరకొండ అంతటితో తన ప్రసంగానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్లిపోయాడు.
Tags:    

Similar News