అర్జున్ రెడ్డి.. అర్జున్ రెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. సెన్సేషనల్ టీజర్.. ట్రైలర్లతో పాటు కొన్ని వివాదాలు కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. కంటెంట్ కూడా బలంగా ఉండటం.. కొత్త తరహా సినిమా కావడంలో విడుదల తర్వాత హైప్ మరింత పెరిగింది. ఐతే విడుదలకు ముందు.. ఆ తర్వాత కూడా ఈ సినిమాలోని ముద్దుల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రిలీజ్ ముందు లిప్ లాక్ పోస్టర్ల మీద ఎంత రగడ జరిగిందో తెలిసిందే. ఇక సినిమాలో రెండంకెల సంఖ్యలో ముద్దులుండటం మీదా చాలానే డిస్కషన్ జరిగింది. ఐతే ఈ ముద్దుల గురించి ఇంత చర్చ ఎందుకుని.. అది చాలా మామూలు విషయమని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ.
ఈ విషయంలో విజయ్ ఆసక్తికర లాజిక్ చెప్పాడు. ముద్దు అనేది ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మార్గమని.. అది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుందని.. చాలా సామాన్యమైన విషయమని.. అందరి జీవితంలో ఉన్న విషయాన్ని తెరమీద చూపించడంలో తప్పేముందని అతను ప్రశ్నించాడు. నిజానికి ఒక మనిషిని చంపడమన్నది అసాధారణమైన విషయమని.. నేరం కూడా అని.. అలాంటి భయంకరమైన విషయాన్ని సినిమాల్లో యథేచ్ఛగా చూపిస్తారని.. దాని విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని జనాలు.. అందరి జీవితాల్లో భాగమైన.. మంచి విషయం.. మామూలు విషయం అయిన ముద్దు గురించి ఇంత రాద్దాంతం చేయడం ఏమిటని అతను ప్రశ్నించాడు. కుర్రాడి లాజిక్ లో అర్థం ఉంది కదా?