వీపుపై VD టాటూ వేయించుకున్న క్రేజీ ఫ్యాన్..!

Update: 2022-07-01 03:44 GMT
డై హార్డ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో హీరోయిన్ల పై ఉన్న ఇష్టాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజీ ఫ్యాన్ ఒకరు తన మెడ పై పోర్ట్రెయిట్ టాటూ వేయించుకొని ఫేవరేట్ హీరోని సర్ప్రైజ్ చేసింది.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న వీడీకి.. లేడీ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది.

అలాంటి వారిలో విజయ్ ని ఆరాధించే చెర్రీ అనే ఓ అమ్మాయి అతని ఫోటోను తన వీపుపై పర్మినెంట్ పచ్చబొట్టుగా వేయించుకుంది. అంతేకాకుండా నేరుగా తన ఫేవరేట్ స్టార్ ‏ను కలిసి సంతోషం వ్యక్తం చేసింది.

VD ని విపరీతంగా అభిమానించే ఇద్దరు అమ్మాయిలు గురువారం తమ ఫేవరేట్ హీరోని కలిశారు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు విజయ్. ఆప్యాయంగా పలకరించిన దేవరకొండను చూసి.. పొంగిపోయిన వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలో అందులో ఒకమ్మాయి తన వీపుపై వేయించుకున్న విజయ్ దేరవకొండ టాటూని చూయించి సర్ ప్రైజ్ చేసింది. ఈ సందర్భంలో 'లైగర్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ కూడా ఉన్నారు. క్రేజీ ఫ్యాన్ మూమెంట్ కు సంబంధించిన వీడియోను 'లైగర్' టీమ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

దీనికి సినిమాలోని సాంగ్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని యాడ్ చేశారు. ''సూపర్ ఫ్యాన్ మూమెంట్.. కొంతమంది అభిమానులు తమ శరీరంపై టాటూతో తమ అభిమానాన్ని గౌరవాన్ని తెలియజేస్తారు'' అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. రమ్యకృష్ణ - రోనీత్ రాయ్ - విష్ణు రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

పూరీ కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాధ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Full View

Tags:    

Similar News