జ‌వాన్ల‌కు ఆర్థిక సాయం మ‌న రౌడీనే ఫ‌స్ట్‌!!

Update: 2019-02-16 05:51 GMT
ఆర్జీవీ త‌ర్వాత అంత బెస్ట్ స్ట్రాట‌జీ తెలిసిన కుర్రాడిగా దేవ‌ర‌కొండ పాపుల‌ర‌వుతున్నాడు. ఈ యంగ్ హీరో ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీనే వేరు అని పొగిడేస్తున్నారంతా. అత‌డు త‌న సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకునే విధానం.. ఇన్నోవేటివ్ ఐడియాల‌జీ అందుకు ఎగ్జాంపుల్. బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ త‌ర‌హాలో టాలీవుడ్ హీరోల్లో దేవ‌ర‌కొండ క్రియేటివిటీ చూపించ‌డంపైనా వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. సోష‌ల్ అవేర్ నెస్ లో బాధ్య‌తాయుత‌మైన యువ‌కుడిగా సామాజిక సేవ‌లోనూ అత‌డు దూకుడు పెంచేస్తున్నాడ‌ని తాజా ట్వీట్ చెబుతోంది.

గ‌తంలో కేర‌ళ వ‌ర‌ద బాదితుల కోసం ముందుగా విరాళం ప్ర‌క‌టించి ఆద‌ర్శంగా నిలిచిన ఈ యువ సంచ‌ల‌నం తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. పుల్వామాలో ముష్క‌రుల మాన‌వ బాంబు దాడిలో అమ‌రులైన వీర‌జ‌వాన్ల కుటుంబాల‌కు అంతా సంతాపం  తెలుపుతుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డే అర్థిక స‌హాయాన్ని అందించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యంలో విజ‌య్ రియ‌ల్ హీరో అనిపించుకున్నాడ‌ని నెటిజ‌న్‌లు సోష‌ల్ మీడియాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఎలాంటి సినిమా నేప‌థ్యం లేని కుటుంబం నుంచి వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్నా చిత‌కా వేషాల‌తో న‌టుడిగా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించాడు. ఎంత ఎదిగినా త‌న మూలాల్ని మ‌రిచిపోని త‌త్వం అత‌న్ని అంద‌రికంటే భిన్నంగా ఆలోచించేలా చేస్తోందని ప‌లువురు విజ‌య్ గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిపోతున్నారు. ``వారు మ‌న కుటుంబాల్ని ర‌క్షిస్తున్నారు. ఈ క‌ష్ట‌కాలంలో మ‌నం వారి కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాలి. సైనికుల జీవితాల‌ను సాయంతో వెల‌క‌ట్ట‌లేము. కానీ దేశం కోసం ప్రాణాల‌ర్పిస్తున్న వారికి మ‌నం మ‌న వంతు స‌హ‌కారం అందించాలి. అందుకే నా వంతు స‌హ‌కారం అందించా. మ‌నంద‌రం క‌లిసి సాయం చేద్దాం. మ‌న‌మంతా క‌లిసి వారికో పెద్ద మ‌ద్ద‌తును క్రియేట్ చేద్దాం`` అంటూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌ లో విజ‌య్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. హ్యాట్సాఫ్ టు విజ‌య్ అని యూత్ పొగిడేస్తున్నారు.
Tags:    

Similar News