విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం మొదటి అయిదు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టడంతో అంతా కూడా 100 కోట్లను ఈ చిత్రం రాబట్టగలదా అని నుకున్నారు. అయితే సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు మాత్రం సినిమాకు మంచి టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ భారీగా వచ్చి 50 కోట్ల గ్రాస్ వచ్చింది. అంతే తప్ప ఈ చిత్రానికి 100 కోట్లు రావడం అనేది అసాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని వారి అభిప్రాయం తలకిందులు అయ్యింది. రెండు వారాల్లోనే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి కొందరి నోట మాట రాకుండా చేసింది.
ఒక చిన్న హీరో చిత్రం - ఒక చిన్న బడ్జెట్ చిత్రం - పెద్దగా సక్సెస్ లు లేని దర్శకుడు తెరకెక్కించిన చిత్రం - కేవలం యూత్ ను మాత్రమే టార్గెట్ చేసి తెరకెక్కించిన చిత్రం ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేస్తే చాలు అని భావించిన చిత్ర యూనిట్ సభ్యులు సైతం షాక్ అయ్యేలా నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం చరిత్రలో నిలిచి పోవడం ఖాయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో - భారీ అంచనాల నడుమ - స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ తో తెరకెక్కిన చిత్రాలు 100 కోట్లను వసూళ్లు చేయడం కామన్. కాని గీత గోవిందం 100 కోట్లను వసూళ్లు చేయడం అనేది అద్బుతంగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.
గీత గోవిందం చిత్రం నైజాం ఏరియాలో దాదాపు 16 కోట్ల షేర్ ను రాబట్టి, ఇంకా మంచి రన్ లోనే ఉంది. ఇక ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్లను వసూళ్లు చేసిన ఈ చిత్రం మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉంది. మరో మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. సీడెడ్ లో 5 కోట్ల - వైజాగ్ లో 4.3 కోట్ల షేర్ ను దక్కించుకున్న ఈచిత్రం అన్ని ఏరియాల్లో కూడా ఈ వారం మొత్తం కూడా మంచి వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈవారంలో విడుదల కాబోతున్న నర్తనశాల - పేపర్ బాయ్ చిత్రాల ఫలితాలు కాస్త అటు ఇటు అయితే గీత గోవిందం కలెక్షన్స్ 125 కోట్లను చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.