‘గీతాగోవిందం’ ఆడియో స్టేజ్ అది.. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నాడు. తనదైన మార్క్ ఎనర్జీ - కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. మైక్ అందుకోగానే పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఓ పనైపోతుంది అని విజయ్ అన్నాడు. అల్లు అరవింద్ మొదలుకొని అందరి కాళ్లకు నమస్కారం పెట్టిన విజయ్.. అమ్మో మో మేడం గారి ఆశీర్వాదం కూడా కావాలంటూ హీరోయిన్ రష్మిక కాళ్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు.
ఈ హఠాత్పరిణామానికి అవాక్కయిన రశ్మిక - వద్దంటూ వెనక్కి జరిగింది. చివరకు వదలకుండా విజయ్ తాను అనుకున్నది సాధించాడు. విజయ్ దేవరకొండ హీరోయిన్ కాళ్లు పట్టుకోవడంతో స్టేజ్ మీద ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అనంతరం ఈ చిలిపి పనికి బిగ్గరగా నవ్వుకున్నారు. ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంగా విజయ్ ఉన్నాడు. అందుకే ఈ సినిమా ఆడియో వేడుకలో జోష్ తో కనిపిస్తూ వినూత్నగా వ్యవహరించాడు.