మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ కోసం పరుగులు పెడుతున్న విజయ్ దేవరకొండ కథలు ప్రాజెక్ట్స్ విషయంలో ఎక్కడా ఆలస్యం జరగకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు వచ్చేలా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. నిన్న మైత్రి సంస్థ హీరో టైటిల్ తో ఆనంద్ అన్నామలై దర్శకుడిగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. హీరో టైటిల్ తో మల్టీ లాంగ్వేజ్ లో అత్యంత భారీగా దీన్ని తీయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
అయితే మన హీరోకు కోలీవుడ్ లో అప్పుడే మొదటి షాక్ తగిలింది. శివ కార్తికేయన్ హీరోగా విశాల్ అభిమన్యుడు దర్శకుడు మిత్రన్ తెరకెక్కిస్తున్న మూవీకి హీరో టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధికారిక అనుమతిని జారీ చేసింది. ఈ మేరకు దాని నిర్మాత సదరు లెటర్ ని మీడియాకు విడుదల చేయడంతో విషయం కాస్త పెద్దది అయ్యేలా ఉంది
అయితే మైత్రి సంస్థ ఈ టైటిల్ తో తమిళ్ లో రిజిస్టర్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోకుండా ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు శివ కార్తికేయన్ కు ఇచ్చేశారు కాబట్టి విజయ్ దేవరకొండకు హీరో పేరు పెట్టుకునే ఛాన్స్ తమిళ్ వెర్షన్ కు ఉండదు. ఒకవేళ ఈ భాషకు మాత్రమే పేరు మారిస్తే కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో పేరు మార్పు తప్పకపోవచ్చు. అయితే దీనికి పరిష్కారంగా మిస్టర్ హీరో అనో నేనే హీరో అనో మార్పు చేయవచ్చు కానీ ఇలాంటి వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరించే టిఎఫ్పిసి తమవాళ్లను కాదని మనకు అనుకూలంగా నిర్ణయం మార్చుకోవడం అసాధ్యం కాబట్టి విజయ్ దేవరకొండ హీరో టైటిల్ విషయంలో ఇకపై ఇంకా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయి