లాంగ్ రైడ్ కు తీసుకెళ్ళనున్న విజయ్

Update: 2018-04-23 05:39 GMT
ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు నిర్మాత గుండెల్లో కొంచెం గుబులుగా ఉంటుంది అనేది వాస్తవం. అయితే ప్రమోషన్స్ అనే ఫార్ములా వచ్చినప్పటి నుంచి వారు కొంచెం దైర్యంగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ వల్ల సినిమా బిజినెస్ మీద ఒక ఐడియా ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది హీరోలు సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో ముందుంటారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.

మనోడి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ హంగామా మాములుగా ఉండదు. మొదటి సినిమా నుంచి ప్రమోషన్స్ తోనే విజయ్ తన సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇకపోతే నెక్స్ట్ విజయ్ ట్యాక్సీ వాలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. సినిమాలో హీరో ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖు ఓలా కంపెనీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయట. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ ఒక మంచి ప్లాన్ వేసింది.

ఫెరారీ లో గెలుపొందిన విజేతలకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తోంది. విజేతలతో విజయ్ ఒక లాంగ్ రైడ్ కి సిద్ధమయ్యాడట. ఆ కంటెస్టెంట్ కోసమే విజయ్ ఈ జాలి రైడ్ కి ఒప్పుకున్నాడట. అయితే విజయ్ ఇది ఎలా చేసినా సినిమాకు హైప్ పెరగడం మాత్రం పక్క. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ - GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. సినిమా పై ప్రస్తుతం అంచనాలు బాగానే పెరిగాయి. మరి విజయ్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News