కొంత మంది కలిసి ప్రయాణం చేస్తుంటే ఎలాంటి అడ్డంకులు.. స్పీడ్ బ్రేకర్ లు ఎదురవ్వవు.. రోలర్ కోస్టర్ రైడ్ లా సాఫీగా సాగిపోతూ వుంటుంది. కొంత మంది ప్రయాణం మాత్రం స్పీడ్ బ్రేకర్లతో.. అడుగడుగునా కుదుపులతో చిత్ర విచిత్రమైన ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతూ వీరి ప్రయాణం కడవరు సాఫీగా సాగేనా? అనే అనుమానాల్ని రేకెత్తిస్తూ వుంటుంది. ఇందులో రెండవ రకం ప్రయాణంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు మైత్రీ మూవీ మేకర్స్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.
'డియార్ కామ్రేడ్' మూవీతో వీరి ప్రయాణం మొదలైంది. మహిళా ప్రధాన సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ తరువాత మరో సారి విజయ్ తో కలిసి ఓ భారీ యాక్షన్ డ్రామాని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. బైక్ రేస్ నేపథ్యంలో సాగే కథతో తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై ని తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మూవీని స్టార్ట్ చేశారు. మాళవిక మోహనన్ కథానాయిక.
ఫస్ట్ షెడ్యూల్ కూడా జరిగింది. కానీ ఆ తరువాత సినిమా ఆశించిన స్థాయిలో రావడం లేదని గ్రహించిన మైత్రీ మూవీ మేకర్స్ వర్గాలు అప్పటికే భారీగా ఖర్చు చేయడంతో ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభంలోనే ఆపేశారు. దానికి విజయ్ అందుకున్న పారితోషికం తిరిగి ఇవ్వకపోవడంతో తనతో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అదే 'ఖుషీ'. శివ నిర్వాణ దర్శకుడు. కశ్మీర్ నేపథ్యంలో కీలక షెడ్యూల్ ని పూర్తి చేశారు. సమంత హీరోయిన్.
హైదరాబాద్ లో కొంత షూటింగ్ చేశారు. ఆ తరువాత నుంచే ఈ ప్రాజెక్ట్ కు సమంత రూపంలో స్పీడ్ బ్రేకర్స్ ఎదురవడం మొదలైంది. ఇటీవల సమంత వ్యక్తిగత కారణాల వల్ల ట్రీట్మెంట్ కోసం ముఎస్ వెళ్లిన విషయం తెలిసిందే. యుఎస్ నుంచి రీసెంట్ గా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సామ్ మైత్రీ వర్గాలకు ఉన్నట్టుండి షాకిచ్చింది. తను గత కొంత కాలంగా మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తనకు సెలైన్ ఎక్కుతున్న ఫొటోని షేర్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఒక్కసారిగా మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు హీరో విజయ్ దేవరకొండ షాక్ కు గురయ్యారు. సామ్ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వేళ తను కోలుకుని మళ్లీ 'ఖుషీ' తదుపరి షెడ్యూల్ కోసం సెట్ లోకి రావడానికి సమయం పడుతుంది. లేట్ అయినా కోద్దీ ఆర్టిస్ట్ ల కాల్షీట్ ల కారణంగా బడ్జెట్, ప్రొడక్షన్ కాస్ట్ మరింత గా పెరిగే ప్రమాదం వుంది.
ఇదే ఇప్పడు మైత్రీ వారిని టెన్షన్ పెడుతోందట. విజయ్ దేవరకొండ మాత్రం ఈ మూవీతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని గట్టి హోప్ తో వున్నాడు. కానీ విధి మాత్రం పరీక్షలు పెడుతూ స్పీడ్ బ్రేకర్లని సృష్టిస్తోంది. ఈ విషయం పసిగట్టిన వాళ్లంతా మైత్రీతో రౌడీ బంధం సాఫీగా సాగడం లేదా? అని ఆరా తీస్తూ కామెంట్ లు చేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.