రౌడీ స్టార్ విజయ్ దేవరకొంలైగార్ సినిమా తర్వాత స్పీడ్ పెంచుదామని అనుకున్నప్పటికీ కూడా పెద్దగా ప్లాన్ వర్కౌట్ కాలేదు. లైగర్ సినిమా కంటే ముందు అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి బాగానే హడావిడి చేశాడు. కానీ లైగర్ దెబ్బకు మళ్ళీ దాని పేరు కూడా ఎవరు ఎత్తలేదు. ఆ సినిమా ఉండదని కూడా చాలామందికి అర్థం అయిపోయింది.
అయితే ఖుషి సినిమాను అయినా సరే త్వరగా పూర్తిచేసి 2022 డిసెంబర్లోనే విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ సమంత అనారోగ్య సమస్యల వలన ఆ ప్రాజెక్టు మళ్ళీ కొంత వాయిదా పడింది. ఇక ఖాళీ సమయంలో సమయాన్ని వృధా చేయకుండా విజయ్ దేవరకొండ భవిష్యత్తు ప్రాజెక్టులను సెట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే అతను ముగ్గురు దర్శకులను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.
గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు కూడా త్వరలోనే మొదలు పెడతాడని ఆమధ్య ఒక టాక్ అయితే గట్టిగానే వినిపించింది. ఇక ఇటీవల గీతగోవిందం దర్శకుడు పరశురామ్ కూడా ఒక కథ చెప్పాడని అలాగే కన్నడ దర్శకుడు నర్తన్ కూడా విజయ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఇక అయితే లైనప్ బాగానే ఉన్నప్పటికీ కూడా విజయ్ దేవరకొండ అప్పుడెప్పుడో ఏడాది క్రితం సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
2023లో ఆ సినిమా ఉంటుంది అని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో ఆ విజయ్ తో మొదలుపెట్టే ఛాన్స్ లేదు. సుకుమార్ పుష్ప తర్వాత మళ్ళీ విజయ్ స్క్రిప్ట్ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రాంచరణ్ తో కూడా అతనికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది.
ఇక సుకుమార్ మీద నమ్మకం పెట్టుకోకుండా విజయ్ అయితే వరుసగా దర్శకులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నాడు. మరి సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఎప్పుడు ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.