‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వ‌స్తోంది

Update: 2018-05-09 07:29 GMT
గ‌త ఏడాది విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుద‌లైంది. ప్ర‌చార పోస్ట‌ర్ల ద‌గ్గ‌ర్నుంచి టీజ‌ర్‌- ట్రైల‌ర్ దాకా అన్నీ సెన్సెష‌న్ క్రియేట్ చేశాయి. గాఢ చుంబ‌న సీన్ల‌ని బ‌స్సుల మీద‌ పోస్ట‌ర్లుగా ముద్రించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అయినా సినిమా రిజ‌ల్ట్ ని ఇవేమీ ఆప‌లేక‌పోయాయి. విడుద‌ల‌య్యాక పెద్ద సునామీయే సృష్టించిందీ సినిమా.

‘అర్జున్ రెడ్డి’ సినిమా గురించి వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర్నుంచి... మంచు ల‌క్ష్మీ దాకా అంద‌రూ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ కి ఫిదా అయిపోయారు. ‘టాలీవుడ్లో గేమ్ ఛేంజ‌ర్‌’ మూవీగా అభివ‌ర్ణించారు. ఈ బోల్డ్ ల‌వ్ స్టోరీ  మూవీలో విజ‌య్ న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్పుడు బెస్ట్ యాక్ట‌ర్ రేసులో స్టార్ హీరోలు తార‌క్‌- ప్ర‌భాస్ వంటి వారితో విజ‌య్ దేవ‌ర‌కొండ పోటీ ప‌డుతున్నాడంటే మ‌నోడి న‌ట‌న ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారిగా వ‌చ్చిన క్రేజ్ తో ఏకంగా అర డ‌జ‌నుకి పైగా సినిమాలు క‌మిట్ అయ్యాడు విజ‌య్‌. అయితే విజ‌య్ కి మాత్రం ‘అర్జున్ రెడ్డి’  సినిమాకి సీక్వెల్ తీయాల‌నే ఆలోచ‌న ఉంద‌ట‌.

‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎండింగ్ లో హీరోయిన్ గ‌ర్భ‌వ‌తిగా ఉంటుంది. సీక్వెల్‌ లో కోపిస్టి డాక్ట‌ర్ ‘అర్జున్ రెడ్డి’ తండ్రి అయిన త‌ర్వాత‌... త‌న కూతురు ప్రేమ‌లో ప‌డితే అత‌ని రియాక్ష‌న్ ఎలా ఉంటుంది. కూతురి బాయ్ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌ ని ఎలా డిసైడ్ చేస్తాడు... అనేది పార్ట్ 2లో చూపించాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం మ‌నోడి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఓ కొలిక్కి వ‌చ్చాక ఈ సీక్వెల్ తెర‌కెక్కే అవ‌కాశం ఉంది. అయితే విజ‌య్ లాంటి యంగ్ హీరో... ఓ యంగ్ అమ్మాయికి తండ్రిగా న‌టించ‌బోతున్నాడంటే అది కూడా ఓ సంచ‌ల‌న‌మే. ఇంత‌కు ముందు శ‌ర్వానంద్ ఇలాంటి పాత్ర‌లో న‌టించి మెప్పించాడు.


Tags:    

Similar News