విజయ్ దేవరకొండ ప్రమోషన్ ఐడియాస్ చాలా భిన్నంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తన అభిమానుల్ని రౌడీస్ అని పిలుస్తూ.. ‘రౌడీ’ పేరుతో ఒక బ్రాండ్ తీసుకురావడం అతడికే చెల్లింది. తన మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌కు సంబంధించిన విజువల్స్‌ను ‘గీత గోవిందం’ వేడుకలో స్టేజ్ మీద డిస్‌ప్లే చేయించి జనాల్ని ఎంటర్టైన్ చేయడం కూడా విజయ్ మార్కు ప్రమోషనే. అంతేనా.. ‘ట్యాక్సీవాలా’ సినిమా ప్రమోషన్ కోసం ఓ థియేటర్‌కు వెళ్లి ఇంటర్వెల్ ఏం తింటారో తినండి బిల్లు నాదే అని చెప్పడమూ విజయ్‌కు మాత్రమే సాధ్యం. అలాగే తన పుట్టిన రోజుకు సిటీస్‌లో ఐస్ క్రీమ్ బండ్లు తిప్పి ఉచితంగా జనాలకు ఐస్‌క్రీమ్స్ ఇవ్వడమూ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇలాంటి ఐడియాలు మనకెందుకు రావు అని చాలామంది హీరోలు ఫీలై ఉంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మరోసారి విజయ్ తన ప్రమోషనల్ టాలెంట్ చూపించాడు.
ఈసారి విజయ్ తన ప్రమోషన్ మార్కు చూపించింది తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం. తొలి సినిమా ‘దొరసాని’ తేలిపోయినప్పటికీ.. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’తో సక్సెస్ సాధించాడు ఆనంద్. ఈ సినిమాకు గాను అతడికి తొలిసారి పారితోషకం కూడా అందిందట. ఆ మొత్తాన్ని అలాగే తీసుకెళ్లి ఓ బిజినెస్‌లో పెట్టేశాడు ఆనంద్. తన మిత్రులు ఇద్దరితో కలిసి హైదరాబాద్‌లో ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ పేరుతో ఓ కేఫ్ మొదలుపెట్టాడు. దీని గురించి చాలా ఉద్వేగంగా నిన్న ఓ పోస్టు పెట్టాడు. ఐతే దీనికి ప్రమోషన్ కల్పించడానికి విజయ్ రంగంలోకి దిగాడు. రాబోయే వీకెండ్లో ఈ కేఫ్‌లో ఎవరు ఏం తిన్నా సరే.. అందులో సగం బిల్లు విజయ్ కడతాడట. అంటే 50 పర్సంట్ డిస్కౌంట్ ఇచ్చి ఆ డిస్కౌంట్ మొత్తాన్ని విజయ్ భరించి నిర్వాహకులకు అందజేస్తాడన్నమాట. తమ్ముడి కేఫ్‌ను చాలా ఈజీగా పాపులర్ చేయడానికి విజయ్ భలే ఐడియా వేశాడని అతణ్ని కొనియాడుతున్నారు ఫ్యాన్స్.