అర్జున్ రెడ్డి మూవీతో యూత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు విజయ్ దేవరకొండ. యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను.. పిల్లలను కూడా మెప్పించేందుకు ఈసారి టాక్సీవాలా సినిమా చేశాడు. ఇంటిల్లిపాది చూసేలా ఈ సినిమా ఉంటుందని విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా చెప్పాడు. ఈ మూవీ పిల్లలు కూడా చూసేలా ఉంటుందంటూ డిఫరెంట్ గా ఓ షార్ట్ ఫిలిం తీసి మరీ ప్రమోషన్ చేశారు. ఈ ఐడియా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఈ సినిమాను ఈ సమ్మర్ లోనే మే 18 నాటికి థియేటర్లకు తీసుకురావాలని అనుకున్నారు. ప్రమోషన్ల జోరు చూస్తే షూటింగ్ పని మొత్తం అయిపోయినట్టే అంతా భావించారు. కానీ ఈ మూవీకి సంబంధించి గ్రాఫిక్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలుస్తోంది. అనుకున్న టైం నాటికి గ్రాఫిక్ పనులు పూర్తయే పరిస్థితి కనిపించడం లేదని యూనిట్ సభ్యుడొకరు చెప్పుకొచ్చారు. గ్రాఫిక్ వర్క్ కోసం మరీ కంగారు పడితే క్వాలిటీపై ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. దీంతో టాక్సీవాలా రిలీజ్ పోస్ట్ పోన్ చేయడమే బెటరని యూనిట్ భావిస్తోందని లేటెస్ట్ టాక్. గ్రాఫిక్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ వచ్చాకే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
కొత్త డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రియాంక జవాల్కర్ - మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్స్స్ 2 - యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. టాక్సీవాలాతో కాకపోయినా మహానటి సినిమాతో విజయ్ దేవరకొండ ఈ సమ్మర్ లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.