ఏకంగా 500 థియేటర్లా!!

Update: 2018-03-26 04:23 GMT
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏళ్ల తరబడి వరుస సినిమాలతో సక్సెస్ లు సాధించి అలరిస్తే కానీ.. సంపాదించుకోలేని క్రేజ్ ను అర్జున్ రెడ్డి తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండకు చెందిన ఓ బ్యాక్ లాగ్ ఈ మధ్య రిలీజ్ అయినా.. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఈ యంగ్ హీరో చూపు అంతా ఇప్పుడు ట్యాక్సీవాలా పైనే ఉంది. గీతా ఆర్ట్స్2.. యూవీక్రియేషన్స్ బ్యానర్ల పై రూపొందిన ఈ మూవీకి.. రీసెంట్ గా ఫస్ట్ గేర్ అంటూ ఫస్ట్ లుక్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ కూడా విపరీతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటినుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కనీసం 500 థియేటర్లలో ట్యాక్సీవాలాను విడుదల చేయాలని చూస్తున్నారట. దీనికి ఓవర్సీస్ రిలీజ్ అదనం అనే సంగతి చెప్పాల్సిన పనేమీ లేదు. ఇంత భారీగా విజయ్ దేవరకొండ మూవీ విడుదల చేయాలని చూస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సహజంగా విజయ్ దేవరకొండ సినిమాలు 300-400 థియేటర్లలో విడుదల అవుతాయి. కానీ ఈ సారి కౌంట్ బాగా పెంచేస్తున్నారు. నిజానికి మేకర్స్ అంచనా ఇంకా ఎక్కువగానే ఉన్నా.. మే 11న విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రానికి ముందు.. అల్లు అర్జున్ నా పేరు సూర్య.. మహానటి విడుదల అయి థియేటర్లలో ఉంటాయి. అలాంటి పరిస్థితిలో 500 థియేటర్ల టార్గెట్ అందుకోవడమే కష్టం. అందుకే అక్కడ సెట్ అయిపోయారట.
Tags:    

Similar News