టాలీవుడ్ లో అందరిని అక్కట్టుకునేల కొత్త తరహా కథలు పుట్టుకొస్తే తప్పకుండా ట్రెండ్ సెట్ అవుతుందని చాలా సినిమాలు నిరూపించాయి. అంతే కాకుండా సినిమా బినేనెస్ లో ఉన్న అందరికి మంచి లాభాలను అందించాయి. అర్జున్ రెడ్డి సినిమాతో బయ్యర్స్ కి అసలైన లాభాలను అందించిన విజయదేవరకొండ ఇప్పుడు తాను కూడా బిజినెస్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. అది కూడా తన సినిమాతోనే.
డిస్ట్రిబ్యూటర్ గా తన సినిమా హక్కులను అందుకోబోతున్నాడట ఈ నటుడు. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్ లో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. పరాశురాం ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరొక సినిమా రాహుల్ సంక్రీత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను విజయ్ పెళ్లి చూపులు తరువాత ఒకే చేశాడు. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ 3 కోట్లు. ట్యాక్సీ వాలా అనే టైటిల్ ని కూడా సెట్ వేశారు. మొదట ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించాలని అనుకున్నారు.
కానీ అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగిపోవడంతో సినిమా బడ్జెట్ పెంచక తప్పలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను విజయ్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. రూ.80 లక్షలకు సెట్ చేసుకొని ఓవర్సీస్ లో భారీగా రిలీజ్ చేసుకోవాలని విజయ్ ప్లాన్ వేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను అందుకుంది. దీంతో మొదటి నుండి నెక్స్ట్ సినిమాని రిలీజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఇక యూవీ క్రియేషన్స్ -గీతా ఆర్ట్స్ తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.