ప్రతీ రంగంలో ప్రధానంగా వినిపిస్తున్న మాట నెపోటిజమ్ (బంధుప్రీతి). టాలెంట్ వున్న వాళ్లని కాకుండా వారసులి మాత్రమే పైకి తీసుకురావడం అనేది ప్రతీ రంగంలో అనాదిగా జరుగుతున్నదే. ఇది ప్రస్తుతం రాజకీయాల్లో.. సినిమా ఇండస్ట్రీల్లో ఇది ప్రధాన చర్చగా మారుతోంది. ప్రతీ సారి దీనిపై అనేక రకాలుగా చర్చ జరుగతూనే వుంది. ఆ మధ్య `అల వైకుంఠపురములో` మూవీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్భంలో దీనిపై హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మరో సారి టాలీవుడ్ లో నెపోటిజమ్ పై చర్చ జరిగింది.
`అల వైకుంఠపురములో` మూవీ థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ నెపోటిజంపై ఆసక్తికర కామెంట్ లు చేశారు. ఒకే ఫ్యామిలీ నుండి వరుసగా హీరోలు రావడం.. ఇండస్ట్రీని హైజాక్ చేస్తున్నారనే కామెంట్స్ చేశారు. దానికి నెపోటిజం అనే నెగెటివ్ పేరుందన్నారు. దీనికి ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ఒక పూజారి తన జీవితం మొత్తం దేవుడికి అంకితం చేశాడు. వాళ్ల కొడుకు కూడా చేశాడు. వాళ్ల మనవడు చేశాడు. మేం కూడా ప్రేక్షక దేవుళ్లకు జీవితం అంకితం చేస్తున్నాం. మా తాత చేశాడు. నేను కూడా చేస్తున్నా.. ఇది నెపోటిజం అనుకుంటే `యస్`.. మేం ఉన్నంతకాలం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే వుంటాం` అని నెపోటిజం వార్తలపై ఘాటుగా స్పందించారు.
తాజాగా ఇదే నెపోటిజంపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కామెంట్ లు చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `లైగర్`. పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. భారీ స్థాయిలో మరిన్ని ప్రత్యేకతలతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గురువారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోకి సుదర్శన్ 35 MM లో `లైగర్` ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ ఔట్ ఆఫ్ ది బాక్స్ తరహాలో తన అభిమానులని ఉద్దేశించిన మాట్లాడిన తీరు నెట్టింట వైరల్ గా మారింది. `గుర్తుందారా అసలు మీకు..ఏందిరా ఈ మెంటల్ మాస్.. ఈ రోజు నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెలవదు.. మా తాత తెలవదు.. ఎవ్వరు తెలవదు..రెండేళ్లవుతోంది సినిమా రిలీజై.. ఆ ముందు రిలీజైనది పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు..అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా..!.. మీరు చూపిస్తున్న ప్రేమని మాటల్లో ట్రై చేస్తా.. ఐ లవ్ యూ..ఈ సినిమాని మీకు అంకితం చేస్తున్నా` అన్నాడు విజయ్ దేవరకొండ.
అంతే కాకుండా `ఈ సినిమాలో మీ కోసమే ఆ బాడీ ట్రై చేశా. ఫైట్స్ చేయడం, డ్యాన్సులు చేయడం చేశా. డాన్స్ అంటే నాకు చిరాకు.. అంత డాన్స్ చేశానంటే మా వోళ్లు గర్వంగా ఫీలవ్వాలని, ఎంజాయ్ చేయాలని.. చేశా. ఆగస్టు 25 రోజు ఇట్లాంటి సెలబ్రేషన్ ప్రతీ థియేటర్లో జరగాలే..థియేటర్లన్నీ నిండిపోవాలే.. గ్యారెంటీగా చెబుతున్నా ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది.
ఆగస్టు 25 న ఆగ్ లగాదేంగే (నిప్పంటిచ్చేద్దాం). ప్రమోషన్స్ సరిగా స్టార్ట్ చేయడం లేదని ముందు మీరు కొంత ఫీలయ్యారు. రాపీ ఇప్పుడు చెబుతున్నా బుల్లెట్ దిగిందా లేదా?..` అని ఫ్యాన్స్ ని హోరెత్తించాడు. ఇదిలా వుంటే ఇండైరెక్ట్ గా విజయ్ చేసిన నెపోటిజమ్ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్ లు వినిపిస్తాయో చూడాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.