2017 ని ఎవరికి ఎంత లాభాన్ని ఇచ్చిందో చెప్పడం కష్టం గాని టాలీవుడ్ సినిమా పరిశ్రమ మాత్రం ఎప్పటికి మరచిపోలేదు. ముఖ్యంగా హీరో విజయ్ సాయి దేవరకొండ అయితే తన జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటాడు అనండంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలానే పెరిగింది. మంచి ఆఫర్స్ కూడా అందుతున్నాయి.
అంతే కాకుండా ఈ ఇయర్ మనోడి క్రేజ్ పరబాషకు కూడా బాగానే పాకింది. విజయ్ నటనను మెచ్చి కోలీవుడ్ దర్శకులు ప్రశంసలను అందించారు. కోలీవుడ్ దర్శకులకు నటనలో ప్రయోగాలు చేసే హీరోలంటే చాలా ఇష్టం. దాదాపు వారి కథలు ఎక్కువగా నటన మీద బేస్ అయ్యి ఉంటాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాలను చూసి అతని నటనకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా శంకర్ - మణిరత్నం లాంటి దర్శకులు విజయ్ ని వారి నెక్స్ట్ కథల్లో నటింపజేయాలని అనుకుంటున్నారట.
ఇక అది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఒక సినిమా అయితే విజయ్ తమిళ్ లో తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చియాన్ విక్రమ్ తో ఇంకొక్కడు సినిమాను తీసిన ఆనంద్ శంకర్ విజయ్ తో సినిమాను చేయడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాత ఆ సినిమాని ఫిబ్రవరి లో గాని మార్చ్ లో గాని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అది సంగతి.