రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ `లైగర్`. వెర్సటైల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఐదు భాషల్లో విడుదలై డబుల్ డిజాస్టర్ అనిపించుకుంది. దాదాపు మూడేళ్లు విజయ్ పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. డే వన్ .. ఫస్ట్ షో నుంచే `లైగర్` డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో విజయ్ దేవరకొండ, అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఎవరితో వుంటుందన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే `అర్జున్ రెడ్డి` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చాలా మంది ప్రొడ్యూసర్లు విజయ్ దేవరకొండ వెంటపడ్డారు. చాలా మంది అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. అందులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వున్నారు. ఆయనే విజయ్ దేవరకొండతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంత కాలంగా ప్రత్యేకంగా ఓ టీమ్ ని ఏర్పాటు చేసి విజయ్ దేవరకొండకు సూటయ్యే కథలని సిద్ధం చేయించే పనిలో వున్నారు దిల్ రాజు. అయితే ఇంత వరకు ఏ స్క్రిప్ట్ తనకు నచ్చకపోవడంతో అది విజయ్ దేవరకొండ వరకు వెళ్లలేకపోయింది. ఆ మధ్య కరోనాకు ముందు శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా అంటూ దిల్ రాజు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాన్ని పక్కన పెట్టడంతో శివ నిర్వాణ `ఖుషీ` మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కీలక షెడ్యూల్ ని ఇటీవల కశ్మీర్ లో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ ని గురువారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండపై దర్శకుడు శివ నిర్వాణ పలు కీలక ఘట్టాలని తెరకెక్కిస్తున్నారట. మరో వారంలో సమంత సెట్ లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే విజయ్ దేవరకొండతో అర్జంట్ గా సినిమా చేయాలని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే తన క్యాంప్ లో వున్న పలువురు స్టార్ డైరెక్టర్లని విజయ్ దేవరకొండకు సరిపడే కథని సిద్ధం చేయమని చెప్పారట. వన్స్ కథ ఫైనల్ అయితే సినిమాని రాకెట్ స్పీడుతో పట్టాలెక్కించాలని దిల్ రాజు చక చకా పావులు కదుపుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అయితే విజయ్ పూరితో `లైగర్` రిలీజ్ కి ముందే `జనగణమన`ని ప్రారంభించాడు. రెగ్యులర్ షూటింగ్ ని ఇంకా మొదలు పెట్టలేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ ముందు అనుకున్న `జనగణమన`కు వెళతాడా? లేక `లైగర్` డిజాస్టర్ నుంచి బయటపడాలని దిల్ రాజు సినిమాకే సై అంటాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. `లైగర్` కారణంగా `జనగణమన`కు ఫైనాన్స్ లభించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ దిల్ రాజు ప్రాజెక్ట్ కే సై అనేలా కనిపిస్తున్నాడని, ఈ ప్రాజెక్టే పట్టాలెక్కుతుందని అంతా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.