విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో భరత్ కమ్మ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అందరినీ ఆకర్షించిన అంశాలలో ఒకటి.. టైటిల్. అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఇది కాదట. భరత్ కమ్మ ఈ సినిమాకు 'డియర్ లిల్లీ' అనే టైటిల్ అనుకున్నాడట. అంతే కాదు స్టొరీ కూడా పూర్తిగా ఇది కాదట.
ఈ సినిమా నిజానికి హీరోయిన్ పాత్ర 'లిల్లీ' చుట్టూ సాగేదట. ఈ సినిమా 'పెళ్ళిచూపులు' తర్వాతే మొదలు కావాల్సిన చిత్రమట. 'పెళ్ళిచూపులు' సినిమా రిలీజ్ కు ముందే ప్రివ్యూ చూసిన భరత్ కమ్మ విజయ్ నటనకు ఫిదా అయ్యాడట. అప్పుడే ఈ సినిమా కథ చెప్పాడట. విజయ్ కు స్టొరీ నచ్చడంతో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. అయితే వేరే ప్రాజెక్టులు త్వరగా ఫైనలైజ్ కావడంతో ఈ సినిమా డిలే అయిందట. అంతలోపు 'అర్జున్ రెడ్డి' విడుదలై సూపర్ హిట్ కావడం.. విజయ్ కు కొత్త ఇమేజ్ రావడంతో దర్శకుడికి తన కథ మీద అనుమానాలు రేకెత్తాయట. ఈ సమయంలో ప్రేక్షకులు విజయ్ నుండి హీరోయిన్ ప్రధానమైన చిత్రాన్ని ఆశించరు అని అర్థం కావడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయాడట. కానీ విజయ్ మాత్రం తనకు కథ నచ్చిందని ఈ సినిమాను చేస్తానని సిద్ధమయ్యాడట. దీంతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి పోయినేడాది పట్టాలెక్కించామని భరత్ కమ్మ తెలిపాడు. ఈ మార్పుల్లో భాగమే 'డియర్ లిల్లీ' టైటిల్ 'డియర్ కామ్రేడ్' గా మారడం.
ఒక హీరోకు సడెన్ గా స్టార్ ఇమేజ్ వస్తే... అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులలో ఇలాంటి మార్పులు జరగడం సహజం. ఈ సినిమా ఇంకా చిన్న చిన్న మార్పులతో పట్టాలెక్కింది కానీ ఇలా హీరోకు ఒక్కసారిగా కొత్త ఇమేజ్ వచ్చినప్పుడు అప్పటికే ఒప్పుకున్న సినిమాలు క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.