సెలవు తీసుకున్న కామ్రేడ్

Update: 2019-04-28 05:44 GMT
ఏదో రీ షూట్ జరుగుతోంది ఫైనల్ రష్ పట్ల హీరో విజయ్ దేవరకొండ అంత సంతృప్తిగా లేడనే పుకార్లకు చెక్ పెడుతూ డియర్ కామ్రేడ్ టీం షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కొట్టేసింది. దీన్ని స్వయంగా దర్శకుడు భరత్ కమ్మ ధ్రువీకరించాడు. సో కామ్రేడ్ విషయంలో వస్తున్న గాసిప్స్ కి దీంతో బ్రేక్ పడిపోయింది. గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కలిసి చేస్తున్న మూవీ ఇది.

ఇప్పటికే టీజర్ లో చూపించిన యాక్షన్ బిట్ తో పాటు లిప్ లాక్ సీన్ ఓ రేంజ్ లో వైరల్ అయిపోయి యూత్ లో అంచనాలు అమాంతం పెంచేసింది. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న డియర్ కామ్రేడ్ మైత్రి సంస్థతో బిగ్ బెన్ కలిసి సంయుక్తంగా నిర్మించింది. స్టూడెంట్ పాలిటిక్స్ లో సెన్సిబుల్ లవ్ స్టొరీని జోడించి ఓ విభిన్నమైన ప్రయత్నం చేసినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది

సో డియర్ కామ్రేడ్ ఇక పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయిపోతోంది. ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ మే 31. కాని ఆ తేదికి తీసుకొచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయి. సమ్మర్ తర్వాతే రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా లీక్స్ వస్తున్నాయి కాని చిత్రలహరి ప్రమోషన్ మీదే ఫోకస్ పెట్టిన మైత్రి సంస్థ డియర్ కామ్రేడ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇంకా ఇవ్వడం లేదు.

విజయ్ దేవరకొండ టాక్సీ వాలా తర్వాత ఇంకే సినిమా రాలేదు. ఆరు నెలల గ్యాప్ తర్వాత వచ్చే మూవీ కాబట్టి అభిమానుల అంచనాలు మాములుగా లేవు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన డియర్ కామ్రేడ్ ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ తాలుకు వివరాలు బయటికి వస్తేనే కాని రిలీజ్ డేట్ కు సంబంధించి ఒక క్లారిటీ రాదు. అప్పటిదాకా వెయిట్ అండ్ సి
Tags:    

Similar News