అంతా విజయ్ దేవరకొండ కంట్రోల్ లోనే?

Update: 2019-04-09 05:39 GMT
గత ఏడాది ఒకటికాదు ఏకంగా నాలుగు సినిమాలతో పలకరించిన యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కొత్త మూవీ ఈ ఏడాది ఇంకా రాలేదు. డియర్ కామ్రేడ్ మే 31 లాక్ చేసుకోవడంతో మొత్తం ఐదు నెలల నిరీక్షణ తప్పలేదు. టీజర్ లో యాక్షన్ షాట్ ప్లస్ లిప్ లాక్ కిస్ సీన్ తో హైప్ ని అమాంతం పెంచేసుకున్న డియర్ కామ్రేడ్ ఆడియో సింగల్ నిన్న రిలీజై మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ అనే ఫీడ్ బ్యాక్ అందుకుంది.

స్లో మెలోడీనే అయినప్పటికీ ట్యూన్ లో ఫ్రెష్ నెస్ మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయిపోతోంది. స్టూడెంట్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అనుకుంటే ఇందులో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ఉందనే క్లారిటీ రావడంలో మెల్లగా దీని మీద బజ్ పెరిగిపోతోంది. అయితే ఇలా ప్లానింగ్ ప్రకారం హైప్ తెచ్చే క్రమంలో ఓ మాస్టర్ బ్రెయిన్ వెనుక నుంచి డైరెక్ట్ చేస్తోందట

ఎవరో కాదు హీరో విజయ్ దేవరకొండనే అని ఫిలిం నగర్ టాక్. ఏ ఆడియో సింగల్ ఫస్ట్ రిలీజ్ చేయాలి టీజర్ లో ఎలాంటి అంశాలను పొందుపరచాలి అనే దాని గురించి స్పష్టమైన డైరెక్షన్స్ ఇస్తాడట. దాని వల్లే ఫలితాలు కూడా బాగుంటున్నాయని సన్నిహితుల మాట. మరి నోటా పోయింది కదా అనే సందేహం రావొచ్చు. అది తమిళ ప్రొడక్షన్ కావడంతో మొత్తం వాళ్ళే చూసుకున్నారని కంటెంట్ వీక్ గా ఉన్నా కనీసం యావరేజ్ గా నిలవాల్సిన సినిమాను ఫ్లోప్ గా మార్చారని వాళ్ళే అంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి విజయ్ దేవరకొండ ఈ రకంగా కూడా తన స్కిల్స్ ని ఉపయోగించి వ్యక్తిగత ఆసక్తితో సినిమాలు ప్రమోట్ చేసుకుని తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నాడన్న మాట.
    

Tags:    

Similar News