విజయ్ దేవరకొండ, సమంత జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ఆరంభంలోనే స్టార్ట్ అయ్యింది. అయితే తరువాత సమంత శాకుంతలం సినిమా కంప్లీట్ చేసే దానిపై దృష్టి పెట్టడం జరిగింది. అనంతరం మయోసైటిస్ తో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఎనిమిది నెలల పాటు ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చింది. ఇక తాజాగా ఆరోగ్యంతో మళ్ళీ ఫుల్ గా రికవరీ అయ్యి సినిమాలపై సమంత దృష్టి పెట్టింది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే జిమ్ వర్క్ అవుట్స్ కూడా సమంత స్టార్ట్ చేసింది. అలాగే సిటాబెల్ వెబ్ సిరీస్ కి సంబందించిన ప్రీప్రొడక్షన్ లో కూడా భాగం అయ్యింది. ఇదిలా ఉంటే సమంత అనారోగ్యం కారణంగా ఖుషి మూవీ షూటింగ్ వాయిదా పడిపోయింది. దీంతో ఈ మూవీకి లాంగ్ గ్యాప్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ కూడా దీని తర్వాతనే నెక్స్ట్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యి ఇంకో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళలేదు.
ఇక సమంత రికవరీ అవ్వడంతో మరల ఖుషి మూవీ షూటింగ్ కి కాల్ షీట్స్ ఇచ్చింది. ఇదే సందర్భంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కూడా తన కారణంగా జరిగిన లేట్ కి సారీ చెప్పింది. ఇక షూటింగ్ కి సమంత రెడీ కావడంతో మరల శివ నిర్వాణ షెడ్యూల్ ఖరారు చేశాడు. ఈ నేపధ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ మ్యూజిక్ దర్శకుడు హేసమ్ అబ్దుల్ తో మ్యూజిక్ సిట్టింగ్ వేశారు.
మలయాళీ సినిమాలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ దర్శకుడిగా కొనసాగుతున్న హేసమ్ కి ఖుషి మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది అని ఈ ఫోటోతో క్లారిటీ ఇచ్చేశారు. ఫిబ్రవరి నెల ఆఖరు లేదంటే మార్చి మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.