ఫ్యామిలీకి టైం ఇచ్చిన రౌడీగారు!

Update: 2019-06-02 10:22 GMT
విజయ్ దేవరకొండకు ఫైనల్ గా కుటుంబంతో సమయం గడిపేందుకు వీలు చిక్కింది.  విజయ్ గత కొంతకాలంగా పలు చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.  ఇప్పుడు కూడా సెట్స్ పై రెండు సినిమాలు ఉన్నాయి కానీ ఫ్యామిలీతో గడిపేందుకు ఒక వారంపాటు బ్రేక్ తీసుకున్నాడని సమాచారం.  అమ్మా నాన్న..తమ్ముడు ఆనంద్.. ప్రొడ్యూసర్ యాష్ రంగినేని ఫ్యామిలీ ఈ ట్రిప్ లో ఉన్నారు.  

ప్రస్తుతం రౌడీగారి కుటుంబం అంతా దక్షిణ ఫ్రాన్స్ లో ఉన్నారట. యాష్ రంగినేని విజయ్ కు అంకుల్ అనే సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ సంగతి తెలుపుతూ ఒక ఫోటో ను షేర్ చేసిన యాష్ రంగినేని "#రౌడీ అబ్బాయిలు.. రౌడీ అమ్మాయిలు సౌత్ ఫ్రాన్స్ లో ఒక చోట ఫ్యామిలీ హాలిడే లో ఉన్నారు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  ఈ ఫోటోలో తన స్టైల్ కు తగ్గట్టే విజయ్ స్లీవ్ లెస్ టీ షర్టు వేసుకొని.. కలర్ఫుల్ క్యాప్.. గాగుల్స్ ధరించి యామా స్టైలిష్ గా ఉన్నాడు.

విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా.. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' చిత్రాలలో నటిస్తున్నాడు.  మరోవైపు విజయ్ సోదరుడు ఆనంద్ 'దొరసాని' చిత్రంతో త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు.
Tags:    

Similar News