ఈసారి ఆడియోకు రెస్పాన్స్ లేదే రౌడీ!

Update: 2020-02-10 03:30 GMT
యువహీరో విజయ్ దేవరకొండ సినిమాల ఆడియో దాదాపుగా సంగీతప్రియులను మెప్పించేలా ఉంటుంది.  నిజానికి విజయ్ నటించిన కొన్ని సినిమాలకు ఆడియో చాలా ప్లస్ అయింది. సినిమాకు ముందే ఒక హైప్ తీసుకొచ్చేలా పాటలు ఉండేవి. అయితే ఈసారి విజయ్ కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో మాత్రం అలా జరగలేదనే టాక్ వినిపిస్తోంది.

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా పాటలు రిలీజ్ అయినప్పటికీ వాటిలో ఒక్కటి కూడా చార్ట్ బస్టర్ గా మారలేదు. గతంలో విజయ్ సినిమాలు రిలీజ్ కు ముందు ఆ సినిమాలో పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ ఉండేవి.  అయితే ఈ సినిమాలో పాటలకు ఆ స్థాయిలో స్పందన దక్కడం లేదు. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఒక పాటను చెప్పమంటే  మెజారిటీ ప్రేక్షకులు జవాబు చెప్పలేక తెల్లమొహం వేసేలా ఉన్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు.  ఈ సినిమాలో మై లవ్ సాంగ్ మాత్రం 2.8 మిలియన్ వ్యూస్ తో కొంచెం  ఫరవాలేదు అనిపించుకుంటోంది. ఇక బొగ్గుగనిలో పాటకు ఇప్పటివరకూ 1.3 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక మిగతా పాటలకు స్పందన ఇంకా తక్కువగా ఉంది.  

ఈ సినిమా పాటలు పెద్దగా బాగాలేవని కొందరు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం దగ్గరుండి మరీ విజయ్ పర్యవేక్షించాడని టాక్ ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ ఆడియోను గమనిస్తే మాత్రం విజయ్ పెద్దగా దృష్టి సారించలేదనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ తర్వాత ఈ పాటలకు ఆదరణ పెరుగుతుందేమో చూడాలి.
Tags:    

Similar News