ఫ్యాన్స్ వార్ మరోమారు కలకలం సృష్టించింది. తమిళనాడులో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ మీద ప్రముఖ హీరో విజయ్ అభిమానులు కత్తులతో దాడి చేశారు. ఈ రోడ్ జిల్లాలోని ఓ దేవాలయం వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు కారణంగా మొదలైన ఈ వివాదం ముదిరిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆఖరికి పోలీసుల జోక్యం - అరెస్టులతో పరిస్థితి సద్దుమణిగింది.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిషెట్టిపాళయం సమీపంలో ఉన్న పారియూర్ కొండత్తు కాళియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. రజనీకాంత్ అభిమానులు జగదీషన్ - పళనిస్వామి తదితరుల తరఫున ఈ సందర్భంగా నంజకౌంటన్ పాళయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయ్ అభిమానులు రత్నవేల్ - త్యాగు - సతీష్ దీనిపై మండిపడ్డారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఘర్షణలో సతీష్ - రత్నవేల్ - త్యాగు కాల్చివేశారు. మా హీరో ఫెక్సీలు తగలబెట్టకూడదని అడ్డుపడిన రజనీకాంత్ అభిమానులు జగదీషన్, పళణిస్వామి మీద విజయ్ ఫ్యాన్స్ కత్తులతో దాడి చేశారు.
ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన రజనీ ఫ్యాన్స్ జగదీషన్ - పళనిస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు పంపించారు. ఇదే సమయంలో ఇటు రజనీ అటు విజయ్ ఫ్యాన్స్ ను పిలిచి వివాదాలకు తావివ్వవద్దని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అభిమానం పేరుతో వివాదాలకు దిగితే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.