తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్ వరుసగా రెండు ఫ్లాప్ లతో కుదేలయ్యాడు. గత ఏడాది సీమ రాజా చిత్రంతో నిరాశ పర్చిన శివ కార్తికేయన్ నిన్న 'మిస్టర్ లోకల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా పరిచయం అయిన శివ కార్తికేయన్ ఒక్కసారిగా వరుసగా విజయాలను దక్కించుకుని స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నాడు. స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈ సమయంలోనే వరుసగా ఫ్లాప్ లు పడటంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంలో పడ్డట్లయ్యింది.
శివ కార్తికేయన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో హీరో విజయ్ పై నెగటివ్ కామెంట్స్ చేశాడు. దాంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న విజయ్ అభిమానులు తమ విశ్వరూపంను చూపేందుకు సిద్దం అయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పటికే శివ కార్తికేయన్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ తాజాగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో శివ కార్తికేయన్ ను టార్గెట్ చేస్తున్నారు. రెండు సినిమాలు ఫ్లాప్ అయినా పెద్దగా నష్టం ఏమీ లేదు, కాని విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శివ కార్తికేయన్ ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డట్లయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో శివ కార్తికేయన్ సక్సెస్ దక్కించుకుంటే తప్ప అతడి కెరీర్ మళ్లీ గాడిలో పడదని సినీ వర్గాల వారు అంటున్నారు.