హీరో దొరికాడు క‌దా అని..! ` బీస్ట్`లో స్క్రీన్ ప్లే ఏదీ?

Update: 2022-04-20 02:30 GMT
త‌మిళ సూపర్ స్టార్ విజయ్ న‌టించిన బీస్ట్ ఇటీవ‌ల రిలీజై క్రిటిక్స్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ స్టార్ డమ్ తో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు బావున్నా కానీ ఆడియెన్ నుంచి పెద‌వి విరుపులు క‌నిపించాయి. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ తండ్రి.. చిత్ర నిర్మాత ఎస్.ఏ చంద్రశేఖర్ బీస్ట్ చిత్రంపై నిరాశను వ్యక్తం చేశారు. అతను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బలమైన స్క్రీన్ ప్లే రాయడంలో విఫలమయ్యాడని ..విజయ్ స్టార్ డమ్ పై మాత్రమే ట్రావెల్ చేశాడ‌ని నిందించాడు.

నేను అరబిక్ కుతు పాట‌ను ఒక అభిమాని ఎలా ఆస్వాధిస్తాడో అలాగే ఆనందించాను. కానీ ఇది పూర్తిగా విజయ్ స్టార్ డమ్ పై ఆధారపడి తీసిన సినిమా. యువ ద‌ర్శ‌కులు కంటెంట్ సాంకేతికత .. మేకింగ్ పరంగా అద్భుతమైన మొదటి చిత్రాన్ని అందించారు. రెండో సినిమాతో కూడా ఎలాగోలా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పెద్ద సూపర్ స్టార్ ల ప్రాజెక్ట్ లను పొందడం ప్రారంభించాక‌.. యువ‌ద‌ర్శ‌కులు ఆలోచించడం ప్రారంభిస్తారు.

``ఇప్పుడు మనకు ఈ హీరోల డేట్లు ఉన్నాయి. మనకు నచ్చిన విధంగా సినిమాలు తీయవచ్చు`` అని వారు అనుకుంటారు. అతనికి (విజ‌య్) ఇప్పటికే విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఫాలోయింగ్ తో అతని చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాబట్టి స్క్రీన్ ప్లే లాంటివి అవసరం లేదు. వారు కొన్ని పాటలు  ఫైట్స్ తో సినిమా చేస్తారు`` అని చంద్రశేఖర్ ఇటీవల ఒక టీవీ చానెల్ కి చెప్పారు.

బీస్ట్ ప్రధాన కథనంలో సీమాంతర ఉగ్రవాదం అంశంపై నెల్సన్  హోంవర్క్ చేయడంలో విఫలమయ్యాడని చంద్రశేఖర్ ఆరోపించారు. ``స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన చాలా భారమైన అంశాన్ని మీరు తేలికగా హ్యాండిల్ చేయ‌లేరు. దర్శకుడు టైం తీసుకుని స్టడీ చేయాలి. RAW ఏజెంట్ గా ఉండటం అంటే ఏమిటో అతను అర్థం చేసుకోవాలి?. లేక RAW శాఖ అంటే ఏమిటి? మిలిటరీ అంటే ఏమిటి? అనేవి తెలియాలి అని అన్నాడు.

హీరో అందుబాటులో ఉన్నాడు కాబట్టి దర్శకుడు షూటింగ్ కి వెళ్లిపోవాల‌ని వెళ్లకూడదని సలహా ఇచ్చాడు. దానికి బ‌దులుగా దర్శకుడు స్క్రిప్ట్ సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. నేను బీస్ట్ సినిమాలో స్క్రీన్ ప్లే చూడలేదు. సినిమా హిట్ అవుతుందని నాకు తెలుసు. అందులో ఎప్పుడూ సందేహం లేదు. ``నేను ఒక సంగీత దర్శకుడు.. ఫైట్ మాస్టర్.., డ్యాన్స్ మాస్టర్.. ఎడిటర్ ..హీరోని (పని) చూశాను`` అని అతను దర్శకుడుగా నెల్సన్ పనిని చూడలేదని అన్నారు.

బీస్ట్ గత వారం థియేటర్లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఓపెనింగుల‌తో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి పేలవమైన రివ్యూలు వచ్చాయి. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టలేకపోయింది. విజ‌య్ సినిమాల్లో ఇది ఫెయిల్యూర్ అని చెప్పాలి. నెగెటివ్ విమ‌ర్శ‌ల‌తో ఈ సినిమా ర‌న్ టైమ్ కుదించుకుపోయింది.  పోటీబ‌రిలో ఉన్న ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 దూసుకెళ్లాయి.
Tags:    

Similar News