చిత్రం : ‘పోలీస్’
నటీనటులు: విజయ్ - సమంత - అమీ జాక్సన్ - ప్రభు - రాధిక - మహేంద్రన్ - బేబీ నైనిక - రాజేంద్రన్ - సునయిన తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: జార్జ్ విలియమ్స్
నిర్మాతలు-: దిల్ రాజు - కలైపులి థాను
రచన - దర్శకత్వం: అట్లీ
తమిళం నుంచి చిన్నా చితకా హీరోలు కూడా తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నారు కానీ.. అక్కడ సూపర్ స్టార్ అయిన విజయ్ మాత్రం ఇక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఐతే గత కొన్నేళ్లలో తుపాకి.. జిల్లా.. లాంటి సినిమాలతో ఓ మోస్తరుగా మార్కెట్ సంపాదించిన విజయ్.. తన కొత్త సినిమా ‘తెరి’ తెలుగు వెర్షన్ ‘పోలీస్’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కలిగింది. తమిళంలో కంటే ఒక రోజు ఆలస్యంగా ఇవాళే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కేరళలో బేకరీ నడుపుకుంటూ తన కూతురు నివేదిత (బేబీ నైనిక)తో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తుంటాడు జోసెఫ్ (విజయ్). ఏ సమస్యలోనూ తలదూర్చని జోసెఫ్.. తన కూతురి జోలికి వచ్చినందుకు ఓ రౌడీ గ్యాంగుని చితకబాదుతాడు. అప్పుడే జోసెఫ్ లోని అసలు మనిషి బయటికి వస్తాడు. అతను హైదరాబాద్ లో డీసీపీగా పని చేసిన విజయ్ కుమార్ అని తెలుస్తుంది. అతడికో గతం ఉంటుంది. ఆ గతమేంటి..? విజయ్ భార్య ఏమైంది..? విజయ్ ఉద్యోగం వదిలేసి.. పేరు మార్చుకుని.. కేరళలో బేకరీ నడుపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది.. అన్నది తెరమీదే చూడాలి.
కథనం-విశ్లేషణ:
హీరో తన ఐడెంటిటీని మార్చుకుని వేరే రాష్ట్రంలో బతుకుతుంటాడు. విలన్లు ఎంత కవ్వించినా అతను రెచ్చిపోడు. కానీ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోతుంటే అతడిలోని హీరో నిద్ర లేస్తాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. గతంలో హీరో పెద్ద పిస్తా. ఓ పెద్ద విలన్ని ఢీకొట్టి అతడికి నిద్ర లేకుండా చేస్తాడు. ఆ విలన్ అదును చూసి హీరో మీద దాడి చేస్తాడు. ఆ అటాక్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఉన్న చోటిని వదిలేసి.. ఐడెంటిటీ మార్చుకుని బతకాల్సి వస్తుంది. ఇక వర్తమానంలోకి వస్తే.. హీరో ఎవరు అన్నది బయటపడిపోవడంతో కథ మళ్లీ మొదటికి వస్తుంది. హీరో తన పాత అవతారంలోకి మారి అతడి ఆట కట్టిస్తాడు.
ఈ ఫార్ములాతో సౌత్ ఇండియాలో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయో లెక్కేలేదు. ‘బాషా’తో మొదలు పెడితే.. సమరసింహారెడ్డి.. ఇంద్ర.. సింహాద్రి.. తాజాగా డిక్టేటర్.. ఇలా ఈ ఫార్మాట్ ను అరగదీసేసిన సినిమాలు తెలుగులో, తమిళంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ‘రాజా రాణి’ లాంటి రిఫ్రెషింగ్ మూవీతో తమిళ-తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ దర్శకుడు అట్లీ కూడా తన రెండో సినిమాకు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు.
తొలి సినిమాగా లవ్ స్టోరీని ఎంచుకుని కొత్తగా ప్రెజెంట్ చేసిన అట్లీ.. తన చేతికి ఓ సూపర్ స్టార్ దొరగ్గానే అందరూ నడిచే దారినే ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించాడు. ఓ పవర్ ఫుల్ పోలీస్ కథను ‘బాషా’ ఫార్మాట్లో కమర్షియల్ హంగులతో కలిపి చెప్పి పాస్ మార్కులతో బయటపడిపోయాడు. కథ విషయంలో ‘పోలీస్’ నుంచి కొత్తగా ఆశించడానికి ఏమీ లేదు. ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ సినిమాకు మైనస్. తర్వాత ఏం జరగొచ్చు అన్నది థియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడూ పసిగట్టేయగలడు. కాకపోతే కథాకథనాలు మన అంచనాలకు తగ్గట్లే సాగినా.. సన్నివేశాలు మాత్రం బోర్ కొట్టించకుండా సాగిపోవడం ప్లస్ పాయింట్.
మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే హీరోయిజం ‘పోలీస్’కు ప్రధాన ఆకర్షణ. కథానాయకుడిలోని అసలైన ‘హీరో’ నిద్ర లేచే సన్నివేశం.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో హీరో తన వీరత్వం చూపించే సీన్స్.. ఇంటర్వెల్ ముందు విలన్ కు షాక్ ఇచ్చే సన్నివేశం.. ఇవన్నీ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఏ వయొలెన్స్ లేకుండా.. ఫైట్ లేకుండా ఇంటర్వెల్ ముందు విలన్ కొడుకు పని పట్టే సీన్ సినిమాకు మేజర్ హైలైట్. రేప్ కేసు చుట్టూ సాగే అరగంట గ్రిప్పింగ్ గా సాగుతుంది. ఇక హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గానే ఉంటూ ఆకట్టుకుంటుంది.
ఐతే ప్రథమార్ధం సాగినంత వేగంగా ద్వితీయార్ధం ఉండదు. హీరోను విలన్ దెబ్బ తీసే వరకు సినిమా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఐతే ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే ఇక సినిమా చూడాల్సిన పనేమీ లేదన్నట్లు తయారవుతుంది. మరీ రొటీన్ గా సాగే చివరి 45 నిమిషాల సినిమా బోరింగ్. మరీ ప్రెడిక్టబుల్ గా.. మొక్కుబడిగా సాగే ఈ ఎపిసోడ్.. వల్ల లెంగ్త్ పెరిగింది తప్ప సినిమాకు పెద్దగా ఉపయోగం లేదు. నిడివి రెండున్నర గంటలు దాటిపోవడంతో ప్రేక్షకుడు అంత సంతృప్తిగా బయటికి రాలేడు. ఫ్లాఫ్ బ్యాక్ తర్వాత ఇంకో 20 నిమిషాల్లో సినిమా ముగించేస్తే బాగుండేది.
నటీనటులు:
విజయ్ మాస్ హీరోయిజం బాగానే పండించాడు. పోలీస్ పాత్రకు బాగా సూటయ్యాడు. అతడి స్టైలిష్ లుక్ బాగుంది. ఐతే తమిళంలో అతను పెద్ద స్టార్ కానీ ఇక్కడ కాదు. కాబట్టి అక్కడి వాళ్ల లాగా మన జనాలు అతడి హీరోయిజాన్ని మరీ అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చేమో. సమంత కీలకమైన పాత్రలో ఆకట్టుకుంది. అందం.. నటన.. రెండింట్లోనూ సమంత మెప్పించింది. ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ బాగున్నాయి. అమీ జాక్సన్ చేసిందేమీ లేదు. విలన్ గా మహేంద్రన్ ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ విలన్లకు అతను భిన్నంగా కనిపించాడు. హీరో పక్కనుండే పాత్రలో రాజేంద్రన్ కూడా బాగానే చేశాడు. హీరో కూతురిగా నటించిన మీనా డాటర్ నైనికను చూస్తే ముచ్చటేస్తుంది. రాధిక ఉన్నంతసేపూ ఆకట్టుకుంది. ప్రభు పెద్దగా చేసిందేమీ లేదు.
సాంకేతికవర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ పాటల్లో విజయ్-సమంత మధ్య వచ్చే డ్యూయెట్లు రెండూ వినసొంపుగా ఉన్నాయి. మిగతా పాటలు మామూలుగా అనిపిస్తాయి. అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద బలం. హీరోయిజం ఎలివేట్ అవ్వాల్సిన సన్నివేశాల్లో అదరగొట్టాడు జి.వి. ‘పోలీస్’ థీమ్ మ్యూజిక్ ఉత్సాహం తెప్పిస్తుంది. జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు ముఖ్య ఆకర్షణ. సినిమాలో ఎక్కడా ఒక డల్ మూమెంట్ కూడా ఉండదు. కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఛాయాగ్రహణం అందించాడతను. యాక్షన్ సీన్స్ లో అతడి పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కొంచెం హడావుడి జరిగిందని.. మాటల్లో పాటల్లో కనిపిస్తుంది. ఇక దర్శకుడు అట్లీ.. ‘రాజా రాణి’లో లాగా తన ప్రత్యేకత చూపించలేకపోయాడు. హీరోయిజాన్ని బాగానే ఎలివేట్ చేశాడు.. హీరో హీరోయిన్ల ట్రాక్ కూడా బాగానే నడిపించాడు కానీ.. అతను ఎంచుకున్న కథ మాత్రం నిరాశపరిచేది. తన లాంటి ప్రామిసింగ్ డైరెక్టర్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశిస్తాం.
చివరగా: పాత పోలీసే.. కానీ ఎంటర్టైన్ చేశాడు.
రేటింగ్- 2.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre