తమిళనాడులో ఐటీ దాడులతో ఓ వైపు హీరో విజయ్ తో పాటు.. పులి చిత్ర నిర్మాతలు, హీరోయిన్ శ్రుతీహాసన్ బెంబేలిత్తిపోగా... అక్కడ పులి బెన్ఫిట్ షోలన్నీ క్యాన్సిల్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ దాడులతో ఆ చిత్ర నిర్మాతలతో పాటు.. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బంది పడ్డారు. దాంతో ఈ సినిమా బెన్ ఫిట్ షోల విషయంలో ఎలాంటి ప్లానింగ్ చేయలేక పోవడంతో.. ఎగ్జిబిటర్లు చేతులెత్తేశారట. దాంతో అక్కడ మార్నింగ్ షోలతో సినిమాను నడిపించాలని చూస్తున్నారు. అక్కడ అలాంటి పరిస్థితి వుంటే.. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల విషయంలో ఇంకా సస్సెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా గురువారం తెలుగులో విడుదల కావడం డౌటే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. దానికి కారణం.. ఆర్థిక ఇబ్బందులే అని తెలుస్తోంది. తెలుగు అనువాద హక్కులు పొందిన నిర్మాత శోభరాణి.. ఇంకా ఫైనాన్స్ క్లియర్ చేయకపోవడంతో.. తెలుగులో మొదటి రోజు విడుదల కాకపోవచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి .
చింబుదేవన్ దర్శకత్వంలో విజయ్, శ్రుతీహాసన్, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి ప్రచారం బాగానే చేశారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ సినిమా ఇది. దాంతో తెలుగు అనువాద హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకే కొన్నారు. అయితే ఫైనాన్స్ క్లియర్ కాకపోవడంతో సినిమా విడుదలలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి క్యూబ్ కు కూడా డబ్బులు చెల్లించలేదని తెలిసింది. సో.. ఫైనాన్స్ క్లియర్ అయితేగాని.. పులి మార్నింగ్ షోలను చూడటం కష్టమే. ఒక వేళ ఫైనాన్స్ మార్నింగ్ క్లియర్ అయితే.. మధ్యాహ్నం నుంచి షోలు వేసే అవకాశం వుంది.