వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీల డైరెక్టర్‌గా పేరొందిన శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తోంది.
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఖుషి' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, మధ్యలో సమంతకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ సజావుగా సాగలేదు. అయితే, ఇప్పుడు మాత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా మరికొద్ది రోజుల్లోనే దీన్ని పూర్తి చేసేలా ప్లాన్లు చేస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఖుషి' మూవీలో పలు ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది నటీనటులు భాగం అయ్యారని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, ఈ చిత్రం సమంత రూత్ ప్రభు తల్లిగా సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో మరో స్టార్ హీరోయిన్ కూడా కీలక పాత్రను చేస్తుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'ఖుషి' మూవీలో టాలీవుడ్ లోని మరో స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆమె విజయ్ దేవరకొండకు గర్ల్‌ఫ్రెండ్ గా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలిసింది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర ఎంతో ఎఫెక్టివ్‌గా.. సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ రోల్‌ను ఎవరు చేస్తారు అన్నది సీక్రెట్‌గా ఉంచారని సమాచారం.
'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీలోని పాటు హిట్ అయింది.