సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ సాగితేనే ఆ స్టార్ కి ఉన్న క్రేజు ఎంతో ఇట్టే తెలుస్తుంది. అక్కడ ఎంతగా డిబేట్ సాగితే అంత గొప్ప. ప్రచారంలో మంచి అయినా చెడు అయినా - సామాజిక మాధ్యమాలే ప్రాతిపాదికగా మారాయి. అక్కడ ఓసారి నివేదిక తయారైందంటే గూగుల్ లో దానినే ప్రామాణికంగా భావించి ప్రతిసారీ క్రిటిక్స్ ప్రస్థావిస్తుంటారు.
నిమిషాలు - గంటల్లో యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో ఎవరెంత ప్రతాపం చూపిస్తారో వాళ్లకు అంత క్రేజు ఉన్నట్టు. మిలియన్ వ్యూస్ - కోటి వ్యూస్ అంటూ లెక్కలు తేలుస్తున్నారు. సినిమాకి ఉన్న క్రేజును బట్టి టీజర్లు - ట్రైలర్లు అంతర్జాలంలో దూసుకుపోతున్నాయ్. తాజాగా ఇలయదళపతి విజయ్ - ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ మూవీ `సర్కార్` టీజర్ రిలీజై మరోసారి రికార్డుల ప్రస్థావనకు కారణమైంది. ఈ టీజర్ ని కేవలం 1గంటలో 40లక్షల మంది వీక్షించారు. ఐదున్నర గంటల్లో (330 నిమిషాలు) కోటి వ్యూస్ దక్కించుకుంది. తొలి 10 నిమిషాల్లో 1 మిలియన్ - 20 నిమిషాల్లో 2 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుని అంతర్జాలంలో దూసుకుపోయింది సర్కార్ టీజర్. 294 నిమిషాల్లో 10లక్షల లైక్స్ దక్కించుకుంది. ఇది నిజంగానే ఓ సెన్సేషన్ కిందే లెక్క. ఇటీవల 2.ఓ వ్యూస్ - రికార్డుల తర్వాత మళ్లీ అంతటి క్రేజు దక్కించుకున్నది సర్కార్ టీజర్ అనడంలో సందేహం లేదు.
గతంలో వచ్చిన క్రేజీ టీజర్ల జాబితా పరిశీలిస్తే... 2.ఓ 24 గంటల్లో 3.25కోట్ల వ్యూస్ దక్కించుకుని సంచలనం సృష్టించింది. రజనీ - అక్షయ్ ల మానియాతో 11 గంటల్లో కోటి పైగా వ్యూస్ దక్కించుకుంది. విజయ్ `మెర్సల్` 24 గంటల్లో కోటి వ్యూస్ దక్కించుకోగా - మెగాస్టార్ `సైరా` టీజర్ 24 గంటల్లో కోటి వ్యూస్ దక్కించుకుంది. అజ్ఞాతవాసి 24 గంటల్లో 68 లక్షల వ్యూస్ దక్కించుకుంది. కబాలి టీజర్ కోటి వ్యూస్ కి 4రోజులు పట్టగా - కాలా టీజర్ 24 గంటల్లో కోటి వ్యూస్ దక్కించుకుంది. జై లవకుశ -40 గంటల్లో కోటి వ్యూస్ అందుకోగా - మహర్షి 10లక్షల వ్యూస్ కి 24 గంటలు పట్టింది. సదరు స్టార్లకు ఎంతో గొప్ప ఆదరణ ఉంటే కానీ ఈ వ్యూస్ సాధ్యం కానేకాదు.