తమిళంలో గత దశాబ్దంలో వచ్చిన ఉత్తమ నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. ముందు నెగెటివ్.. క్యారెక్టర్ రోల్స్ చేసిన అతను.. ఆ తర్వాత హీరోగా అప్ గ్రేడ్ అయ్యాడు. తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ.. అద్భుతమైన పాత్రల్ని పండిస్తూ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. ఎంత సింపుల్ క్యారెక్టర్లో అయినా తన ప్రత్యేకతను చాటుకునే విజయ్.. ఏవైనా స్పెషల్ క్యారెక్టర్లు పడితే చెలరేగిపోతుంటాడు. అతడికిప్పుడు అలాంటి రోలే దొరికినట్లుగా కనిపిస్తోంది.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘సీతా కత్తి’. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి 70 ఏళ్ల వయసున్న ముసలివాడి పాత్రలో నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజైంది. అందులో విజయ్ లుక్ చూసి అందరూ షాకైపోతున్నారు. ఈ చిత్రం విజయ్ ముసలివాడి పాత్ర పోషిస్తున్నట్లు ముందే వెల్లడైంి.
ఈ పాత్ర విషయంలో ఆల్రెడీ జనాల్లో ఉన్న అంచనాల్ని మించిపోయేలా ఫస్ట్ లుక్ ఉంది. ‘భారతీయుడు’లో ముసలి కమల్ హాసన్ ను తలపిస్తోంది విజయ్ లుక్. ఐతే ఇప్పుడు మేకప్ టెక్నిక్స్ మరింత మెరుగుపడిన నేపథ్యంలో విజయ్ లుక్ ఇంకా ఎఫెక్టివ్ గా కనిపిస్తోంది. మామూలు పాత్రల్లోనే చెలరేగిపోయే విజయ్ కి.. ఇలాంటి పాత్ర పడితే చెప్పేదేముంది? సినిమా కచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు. విజయ్ కి హీరోగా ఇది 25వ సినిమా కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ తో పాటు ఇంకో ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ ధరణీధరన్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కి జోడీ కూడా ఎవరూ లేరు. ఇది రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అంటున్నారు. డిసెంబర్లోనే ‘సీతాకత్తి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ప్రస్తుతం తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.