కొంతకాలంగా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ల జీవిత కథలను ఆయా పరిశ్రమల ఫిల్మ్ మేకర్స్ సినిమాలుగా మలిచారు.
వీటిలో చాలా వరకూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఫలితంగా ఈ క్రమంలోనే మరికొంత మంది లెజెండ్ ల కథలతో ప్రాజెక్టులను రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మరో మాజీ ముఖ్యమంత్రి బయోపిక్ కూడా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
కర్ణాటక సీఎంగా పనిచేసిన సిద్ధరామయ్యకు ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. రామ్ మనోహర్ లోహియా శిష్యుడిగా ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జనతాదళ్ యునైటెడ్ లో నాయకుడిగా మారాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎం స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు సిద్ధరామయ్య జీవిత చరిత్రను తెరెక్కించే పనికి పూనుకున్నారు.
సిద్ధరామయ్య బయోపిక్ ను తెరపైకి తెచ్చింది ఆయన శిష్యులే కావడం విశేషం. ఈ మాజీ సీఎం క్యాబినెట్ లో పనిచేసి విధేయులుగా పేరు తెచ్చుకున్న శివరాజ్ తంగడాగి, శివకుమార్ లే సిద్ధరామయ్య బయోపిక్ కోసం మాస్టర్ ప్లాన్లు చేస్తున్నారట.. ఇప్పటికే కొన్ని పాయింట్లతో కథను కూడా రెడీ చేయించారు. డిసెంబర్ 2న సిద్ధరామయ్యతో భేటి అయ్యి ఆయనకు స్టోరీ లైన్ ను వినిపిస్తారని.. దానికి ఓకే చెబితేనే ఇది పట్టాలెక్కుతోందని టాక్.
మాజీ సీఎం సిద్ధరామయ్య బయోపిక్ మూవీ ప్రకటన జరగకముందే ఇందులో టైటిల్ రోల్ చేసే హీరో పేరు తెరపైకి వచ్చింది. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఈ రోల్ కోసం తీసుకోబోతున్నారట.. ఇప్పటికే అతడి నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలిసింది.
వచ్చేఏడాదిలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి మార్చిలోపు సిద్ధరామయ్య బయోపిక్ షూటింగ్ జరిపి ఎన్నికల ముందు దీన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.